ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే మ్యాన్ ఆఫ్ మాసెస్, ఎవరూ చేయని పనిచేస్తున్నాడు. ఎవరూ వేయని పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ గా మారుతున్న ఎన్టీఆర్, హాలీవుడ్ హీరో నికోలస్ కేజ్ లాంటి పాత్ర వేయబోతున్నాడు. ప్రపంచంలో ఇలాంటి పాత్రలు వేసిన హీరోల లిస్ట్ లో ఇక మీదట, ఇద్దరి పేర్లే వినిపిస్తాయి. వాళ్లే హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాని ఏలుతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్… నిజానికి తన తాత ఎన్టీఆర్ కూడా ఈవిషయంలో ఎప్పుడోచరిత్ర స్రుష్టించాడు. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ లా మాత్రం మరో అడుగు ముందుకువేయలేదు. అంతలా ఎన్టీఆర్ జూనియర్ ఏం చేస్తున్నాడు… అంతగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటి హీరో అనిపించేలా డ్రాగన్ లో తన పాత్ర ఎలా ఉండబోతోంది?
యంగ్ టైగర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫస్ట్ హీరోగా మారేలా ఒక పాత్రతో చరిత్ర స్రుష్టించబోతున్నాడు. కేజీయఫ్, సలార్ తోసెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ లో తన పాత్రే మతిపోగొట్టేలా ఉందనే మాట వినిపించటానికి రీజన్, ఊహించని తారక్ విజన్..
అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్ పాన్ ఇండియా మొత్తానికి యముడిగా మారబోతున్నాడు. త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా ఎటాక్ చేసిన తారక్, అందులో కొమరం భీమ్ గా గోండు కాపరి, యోదుడిగా కనిపించాడు. దేవరలో తన గ్యాంగ్ కి నాయకుడయ్యాడు. ఇలా రెండు సార్లు బాక్సాఫీస్ బద్దలు చేశాక, మూడోసారి పాన్ ఇండియా మార్కెట్ కి యముడిగా మారబోతున్నాడు
ఇదేలా ఇండియాలో ఫస్ట్ టైం అనిపించే పాత్రనే డౌట్ రావొచ్చు.. కాని ఇది నిజం… డ్రాగన్ లో ఎన్టీఆర్ వేసేది యముడి పాత్రే… అంటే ఇంతవరకు తను వేయని పాత్రా అంటే కానే కాదు. రాజమౌళి మేకింగ్ లోఆల్రెడీ యంగ్ యమగా, యమదొంగగా మారాడు. హిట్ మెట్టెక్కాడు..
అలానే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ లెజెండ్ ఎన్టీఆర్ ఎప్పుడో యముడిగా వెండితెరని వణికించాడు. ఎస్వీ రంగారావు, కైకాలా సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు కూడా యముడి పాత్రలేస్తే, తమిళ్ లో ఎమ్ జీఆర్ ఆ పాత్రలో కనిపించాడు. అలా చూస్తే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ పాత్ర వేసిన వ్యక్తిగా ఎన్టీఆ్ ఐదో వ్యక్తి… కాని పాన్ ఇండియా లెవల్లోమాత్రం ఎవరూ ఆపాత్ర వేయలేదు.
అలా చూస్తే పాన్ ఇండియాన్ లెవల్లో యముడి పాత్రతో దండెత్తబోతున్న మొదటి హీరోగా ఎన్టీఆర్ చరిత్ర స్రుష్టించబోతున్నాడు. ఇదొక్కటే కాదు, డ్రాగన్ లో ఎన్టీఆర్ గధ, కిరీటంపెట్టుకుని కనిపించడని తెలుస్తోంది. హాలీవుడ్ మూవీలో గోస్ట్ రైడర్ లో నికోలస్ కేజ్ బైక్ మీద యమపాశంతో బ్రహ్మరాక్షసిగా వచ్చినట్టు డ్రాగన్ లోనిప్పులు కక్కబోతున్నాడు తారక్. ఇదో మైథలాజికల్ డ్రామాని మాఫియా బ్యాక్ డ్రాప్ తో తీయబోతున్నారట. అదే ఎగ్జైటింగ్ ఎలిమెంట్… ఇదే కనక సినిమా గామారితే, వరల్డ్ వైడ్ గా ఇలాంటి లుక్, ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో వచ్చిన రెండో పాత్రగా నికోలేస్ కేజ్ తర్వాత ఎన్టీఆర్ పేరే మారుమోగేలా ఉంది.