తన రికార్డ్ తానే బద్దలు కొట్టిన దేవర…

ఏ ముహూర్తంలో దేవర సినిమా మొదలుపెట్టారో గాని... ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియా నడుస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ లెక్కలు వేయడం, దేవర కొత్త రికార్డులు నమోదు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా దేవర తన స్పీడ్ పెంచింది.

  • Written By:
  • Publish Date - September 11, 2024 / 06:30 PM IST

ఏ ముహూర్తంలో దేవర సినిమా మొదలుపెట్టారో గాని… ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియా నడుస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ లెక్కలు వేయడం, దేవర కొత్త రికార్డులు నమోదు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా దేవర తన స్పీడ్ పెంచింది. విడుదలకు ముందే 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి… ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుని అమెరికాలో సొంతం చేసుకుంది దేవర. త్వరలో ఇక్కడ కూడా ప్రీ బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది.

తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కాగా అన్ని భాషల్లో ఊహించని విధంగా దూసుకుపోతుంది. మంగళవారం సాయంత్రం 5.04 గంటలకు విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటికే 35 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ తో బయట పెట్టింది. సముద్రం పొంగితే ఇలాగే ఉంటుంది అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ నెల 27 న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. హిందీ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి ప్రమోషన్ చేస్తోంది దేవర చిత్ర యూనిట్.

అది అలా ఉంచితే… కన్నడలో ఈ సినిమాపై హైప్ భారీగా క్రియేట్ అయింది. రాజ్ కుమార్ ఫ్యామిలీతో పాటుగా పలువురు స్టార్ హీరోలతో ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉంది. దీనితో అక్కడి ఫ్యాన్స్ కూడా సినిమాలు బాగా చూస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కు సొంత ఫ్యాన్ బేస్ కూడా అక్కడ ఉంది. ఇక కన్నడ డబ్బింగ్ అయితే 4 గంటల్లోనే పూర్తి చేసాడట ఎన్టీఆర్. ఈ విషయాన్ని లిరిసిస్ట్ వరదరాజ్ బయటపెట్టారు. ఎంతో చక్కగా కన్నడలో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారాన్ని… ఆర్ఆర్ఆర్ సినిమాకు 5 గంటలు తీసుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాకు కేవలం 4 గంటలు మాత్రమే తీసుకున్నాడట.