దేవర సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ల్యాండ్ అయింది తంగం. పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ సినిమాకు మించి దేవర కొట్టిన హిట్ తో… తంగం కూడా ఇప్పుడు ఖుషీగా ఉంది. జాన్వీ కపూర్ పాత్ర దేవర సినిమాలో చాలా తక్కువే అయినా… ఆమెకు మాత్రం ఆ సినిమా చాలా సాటిస్ఫ్యాక్షన్ ఇచ్చింది అనే మాట నిజం. ఇప్పుడు దేవర సినిమా తర్వాత తెలుగులో వరుస ప్రాజెక్ట్ లకు రెడీ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో ఓ సినిమాను ఫైనల్ చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ షురూ కానుంది.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రానున్న సినిమాలో ఆమె నటిస్తుందనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది. అది ఎంత వరకు నిజమో జక్కన్నే చెప్పాలి. అటు తమిళంలో కూడా దేవర ప్రమోషన్స్ తో జాన్వీ దగ్గరైంది. ఆమె తమిళంలో మాట్లాడటం చూసి అక్కడి జనాలు కూడా షాక్ అయ్యారు. తల్లిని స్టార్ చేసింది తమిళం. ఆ విశ్వాసం జాన్వీ చూపించడం, తమిళం మాట్లాడటం చూసి అక్కడి డైరెక్టర్ లు కూడా ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు జాన్వీకి ఆఫర్స్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు.
ఇక ఇప్పుడు జాన్వీ చెల్లెలు ఖుషీ కూడా టాలీవుడ్ లో పాగా వేసేందుకు సెట్ చేస్తోంది. దేవర సినిమాతో అక్క ఇక్కడ హడావుడి చేస్తే… దేవరతోనే తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఖుషీ కపూర్ భావిస్తోంది. తండ్రి బోనీ కపూర్ సలహాతో, అక్క ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో హైదరాబాద్ లో ల్యాండ్ కానుంది. ఎన్టీఆర్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమా షూట్ ఇప్పటికే స్టార్ట్ అయింది కూడా. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఖుషీ నటించే ఛాన్స్ ఉంది. కన్నడ హీరోయిన్… రుక్మిణీ వసంత్ ఇప్పటికే ఫైనల్ అయిందని టాక్.
సెకండ్ హీరోయిన్ గా కుషీని ఫైనల్ చేయాలని నీల్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు కుషీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్క కంటే చెల్లెలు బాగుంది అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఆమె ఒక్కసారి సక్సెస్ అయింది అంటే మాత్రం సౌత్ లో పాగా వేయడం పెద్ద మేటర్ కాదు. సౌత్ లో హీరోయిన్ల కొరత గట్టిగానే కనపడుతోంది. ఎటు తిరిగి ఎటు చూసినా రష్మిక, మృణాల్ ఠాకూర్ మినహా ఎవరూ కనపడటం లేదు. అందుకే ఇప్పుడు కుషీ ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలని చూస్తున్నట్టు టాక్.