టాలీవుడ్ లో ఇప్పుడు దేవర సినిమా జాతర పీక్స్ లో ఉంది. సినిమాపై ఏ రేంజ్ లో నెగటివ్ ప్రచారం చేసినా సినిమా మాత్రం రికార్డులను తొక్కుకుంటూ పోతోంది. భాషతో సంబంధం లేదు దేశంతో సంబంధం లేదు ఇప్పుడు దేవర హవా పీక్స్ లో ఉంది. సినిమా అస్సలు బాగాలేదు అంటూ కావాలని ట్రోల్ చేసిన వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోతే దేవర సునామీ మాత్రం పీక్స్ లో కనపడుతోంది. సినిమా విడుదల అయి 17 రోజులు దాటుతున్నా సినిమా మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఇతర భాషల్లో కూడా దేవర స్పీడ్ పెరుగుతోంది ఇంకా.
మూడు సినిమాలు విడుదలైనా కూడా దేవర హవా మాత్రం తగ్గలేదు. మన తెలుగులోనే కాదు హిందీలో కూడా తగ్గడం లేదని అక్కడి సినిమా పండితుడు తరణ్ ఆదర్శ్ ఎక్స్ లో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చాడు. ఇక దేవర దెబ్బకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు కనుమరుగు అవుతున్నాయనే మాట అక్షరాలా నిజం. ఇతర స్టార్ హీరోలు అందరికి ఇప్పుడు దేవర కొత్త టార్గెట్ లు ఫిక్స్ చేసేస్తున్నాడు. దేవర జాతర దెబ్బకు దాదాపు అందరి హీరోల రికార్డులు కనుమరుగు అవుతున్నాయి. భారీ అంచనాలను సినిమా ఇప్పుడు అందుకోవడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నాన్ రాజమౌళి మూవీస్ రికార్డులను దేవర తుడిచిపెట్టింది. అంటే కల్కీ, సలార్ రికార్డులనుదేవర ఎర్ర సముద్రంలో కలిపింది. ఆర్ఆర్ఆర్ సినిమా 17 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో 154 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో బాహుబలి సినిమా ఉంది. 136.7 కోట్లు 17 రోజుల్లో ఆ సినిమా వసూలు చేసింది. ఇక దేవర 17 రోజుల్లో 94 కోట్ల 90 లక్షలు వసూలు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. పై రెండు సినిమాలు రాజమౌళి సినిమాలు. ఇది ఒక్కటే వేరే డైరెక్టర్ సినిమా.
రాజమౌళి సినిమాలకు కొరటాల శివ సినిమాలకు హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. వాటిని ఇప్పుడు ఈ సినిమా బీట్ చేసింది. ఎన్టీఆర్ పేరు చరిత్రలో మిగిలిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఉత్తరాంధ్రలో అయితే 17 రోజుల్లో అయితే దేవర జాతర పీక్స్ లో ఉంది. 17 రోజుల్లో 17 కోట్ల 30 లక్షలు వసూలు చేసింది దేవర సినిమా. అది కూడా ఫ్లాప్ టాక్ తో. ఇక సలార్ సినిమా అయితే 17 రోజుల్లో 17 కోట్ల 2 లక్షలు వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ టాక్ తో. దీనితో ప్రభాస్ రికార్డులను దేవర కనుమరుగు చేసింది అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.