Chandra Mohan: చంద్రమోహన్‌కు మాట ఇచ్చి తప్పిన ఎన్టీఆర్‌..!

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పరు అనే ఒక పేరు ఉండేది. అయితే, ఎన్టీఆర్.. చంద్రమోహన్‌కు మాట ఇచ్చి కోరిక తీర్చకుండానే చనిపోయారట. గతంలో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీల‌క పాత్రలో నటించిన చంద్రమోహన్.. చాలామంది స్టార్ హీరోయిన్ల‌కి లక్కీ హీరో.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 02:05 PM IST

Chandra Mohan: చంద్రమోహన్‌ మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. అన్నయ్య అయినా.. నాన్న అయినా.. మావ అయినా, తాత అయినా.. పాత్ర ఏదైనా పాత్రే కనిపించేది తప్ప ఆయన కనిపించేవారు కాదు. అలాంటి టాలెంటెడ్ చంద్రమోహన్ ఇక లేరు.. ఇకపై కనిపించరు అన్న ఆలోచనే కన్నీళ్లు ఆపుకోకుండా చేస్తోంది. చంద్రమోహన్ మరణం తర్వాత ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు.

Chandramohan lost 100 crores : 100కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. సంపాదన కంటే కోల్పోయిందే ఎక్కువ

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పరు అనే ఒక పేరు ఉండేది. అయితే, ఎన్టీఆర్.. చంద్రమోహన్‌కు మాట ఇచ్చి కోరిక తీర్చకుండానే చనిపోయారట. గతంలో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీల‌క పాత్రలో నటించిన చంద్రమోహన్.. చాలామంది స్టార్ హీరోయిన్ల‌కి లక్కీ హీరో. చంద్రమోహన్‌తో మొదటి సినిమా తీసిన చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో శ్రీదేవి, జయప్రద కూడా ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రమోహన్ కూడా కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అప్పట్లో మీ సినిమాల్లో కీ రోల్‌ ఉండే ఒక పాత్రను ఇవ్వమ‌ని సీనియర్ ఎన్టీఆర్‌ను చంద్రమోహన్ అడిగేవార‌ట‌. ఎన్టీఆర్ కూడా తప్పక ఇస్తాన‌ని మాటిచ్చారట. చాలా కాలం పాటు ఆయనకు ఆ అవకాశం రాలేదు. కొంతకాలానికి చంద్రమోహన్ తానే ఓ సినిమా తీస్తున్నానంటూ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి చెప్పాడట. అందులో మీరు హీరో, మీ తమ్ముడు పాత్రలో తాను చేస్తాన‌ని చంద్రమోహన్ అడగడంతో ఎన్టీఆర్ ఆ సినిమాకు ఓకే కూడా చెప్పారు.

చంద్రమోహన్ సినిమా ఒప్పుకున్నాక కూడా ఆ సినిమా కంటే ముందే శ్రీనాథ కవిసార్వభౌమ‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటించారు. ఈ సినిమా తర్వాత అయినా ఎన్టీఆర్.. తన సినిమాలో నటిస్తార‌నుకున్న చంద్రమోహన్‌కు ఆ కోరిక తీరలేదు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇక ఆ కల.. కలగానే మిగిలింది. చంద్రమోహన్ మరణం తర్వాత ఇప్పుడా విషయాలు గుర్తుచేసుకొని ఫ్యాన్స్.. కన్నీటి పర్యంతం అవుతున్నారు.