నెం.1, నెం.2 పాన్ ఇండియా కింగ్స్ వాళ్లే.. మరి నెం. 3 ఎవరు?

పాన్ ఇండియా కింగ్స్ క్లబ్ ఓపేన్ అయ్యింది. ఈ క్లబ్ ని తెరిచింది వెయ్యికోట్ల మొనగాడు రెబల్ స్టారే... బాహుబలి నుంచి కల్కీ వరకు వెయ్యికోట్ల వసూళ్లని చాలా కామన్ గా మార్చేసిన ప్రభాసే, ఫస్ట్ పాన్ ఇండియా కింగ్.

  • Written By:
  • Publish Date - November 25, 2024 / 05:24 PM IST

పాన్ ఇండియా కింగ్స్ క్లబ్ ఓపేన్ అయ్యింది. ఈ క్లబ్ ని తెరిచింది వెయ్యికోట్ల మొనగాడు రెబల్ స్టారే… బాహుబలి నుంచి కల్కీ వరకు వెయ్యికోట్ల వసూళ్లని చాలా కామన్ గా మార్చేసిన ప్రభాసే, ఫస్ట్ పాన్ ఇండియా కింగ్. ఆ తర్వాత ప్లేస్ కోసం యష్, చరణ్, బన్నీ పోటీ పడినా, ఎన్టీఆరే రెండు పాన్ ఇండియా హిట్స్ తో మార్కెట్ ని షేక్ చేశాడు. పాన్ ఇండియాకి మ్యాన్ ఆఫ్ మాసెస్ అయ్యాడు. సో పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో నెం.1 గా ప్రభాస్, నెం.2 గా ఎన్టీఆర్ ప్లేస్ కన్ఫామ్ అయ్యిందనుకోవచ్చు. కాని నెం.3 ప్లేస్ ఎవరిది? ఈ ప్రశ్నకే డిసెంబర్ లోసమాధానం దొరుకుతుందా? జనవరిలో రిజల్ట్ వస్తుందా అన్న డిస్కర్షన్ జరుగుతోంది. పుస్ప2 తో బన్నీ గేమ్ ఛేంజర్ తో చరణ్ ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత స్థానం కోసం చాలా పెద్ద పరీక్షని ఫేస్ చేస్తున్నారు.. మరి ఇందులో కేజీయఫ్ రాఖీ భాయ్ ప్లేస్ ఎక్కడ? హావేలుక్

పాన్ ఇండియా క్లబ్ లో ఇప్పటి వరకు రెండంటే రెండే సింహాసనాలున్నాయి. ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ కి, రెండో ది మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి… సడన్ గా ఈ డిస్కర్షన్ పెరగటానికి కారణం, ఇంతవరకు మూడో స్తానం ఎవరిదో డిసైడ్ కాలేదు. రెండు సార్లు రెండు సినిమాలతో వెయ్యికోట్లు రాబట్టిన బాలీవుడ్ బాద్ షాకి కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో చోటు దక్కలేదు

కాని ప్రభాస్,ఎన్టీఆర్ మాత్రమే అక్కడ సింహాసనాలు వేసుకుని స్థిరపడ్డారు. దానికి కారణం, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖానే కాదు, యానిమల్ తో హిట్ మెట్టెక్కిన రణ్ బీర్ కపూర్ నుంచి హ్రితిక్ వరకు ఎవరూ కూడా పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకోలేదు. పటాన్, జవాన్ రెండూ కూడా 1000 కోట్లు రాబట్టి ఉండొచ్చు. కాని అది అంతా హిందీ మార్కెట్ మహిమే… సౌత్ లో ఆరెండీంటి సోసోగా కూడా రెస్పాన్స్ రాలేదు. సల్మాన్ కి సౌత్ లో సీన్ లేదు. దంగల్ తో ఆమిర్ నార్త్, సౌత్ ని షేక్ చేసినా, చైనాలో వచ్చిన వసూళ్లు లెక్కలోకి తీసుకోకపోతే, దంగల్ కి ఇండియాలో 1000 కోట్ల సీనే రానట్టే..

సో ఖాన్లూ, కపూర్లే కాదు, కోలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు మరే హీరోకి పాన్ ఇండియా కింగ్ అనిపించుకునే రేంజ్ రాలేదు. పాన్ ఇండియా లెవల్లో అన్ని మార్కెట్లలో కనీసం రెండు హిట్లు సొంతంచేసుకుంటేనే పాన్ ఇండియా కింగ్ అయితే, కేజీయఫ్, కేజీయఫ్2 తో రెండు హిట్లు పట్టిన యశ్ కి పాన్ ఇండియా కింగ్ టైటిల్ సొంతమయ్యే ఛాన్స్ఉంది. కాని రెండీంటికి క్రెడిట్ ప్రశాంత్ నీల్ కే దక్కుతోంది. ఈ సారి తను చేస్తున్న టాక్సిక్ హిట్టైతే, ఇక తను కూడా పాన్ ఇండియా కింగ్ అనొచ్చు..

ఈవిషయంలో త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి సాయం లేకుండా తారక్ దేవరతో తానేంటో పాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ అయితే సాహో, సలార్, కల్కీతో మూడు సార్లు పాన్ ఇండియాలెవల్లో విత్ ఔట్ రాజమౌళీ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంతొచ్చింది

పుష్ప2 హిట్టైతే తను కూడా యశ్ లా వరుసగా ఒకే దర్శకుడితో, ఒకే మూవీ సీక్వెల్స్ తో రెండు సార్లు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నవాడవుతాడు.. కాబట్టి పాన్ ఇండియా మూడో కింగ్ గా ఇప్పుడు కాదు, త్రివిక్రమ్ మూవీతో నే అల్లు అర్జున్ ఫేట్ మారేఛాన్స్ ఉంది. ఇక చరణ్ విషయానికొస్తే, రాజమౌళి సపోర్ట్ లేకుండా తానేంటో ప్రూవ్ అవ్వాలంటే గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ లో సీన్ ఛేంజ్ అవ్వాలి… సో యశ్, బన్నీ, చరణ్ లో పాన్ ఇండియా మూడో కింగ్ గా ముందుగా సింహాసనం దక్కే ఛాన్స్ యష్ కి లేదంటే చరణ్ కే ఉంది. పుష్ప2 హిట్టైనా కాని ఇప్పడప్పుడే పాన్ ఇండియా సెకండ్ కింగ్ అనే పరిస్థితి రాదనుకోవాల్సి వస్తోంది.