సమ్మర్ అంతా పెద్ద సినిమాలు లేక ప్రేక్షకులు ఎదురుచూశారు. దీంతో కొన్ని ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసిన పరిస్థితి కూడా చూశాము. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ సీజన్ ఉండడం చేత ప్రేక్షకులు కూడా పెద్దగా థియేటర్లు రాలేదు అనే వాదన కూడా ఉంది. ఇవన్ని కాసేపు పక్కన పెడితే బడా హీరోల సినిమాలు ఇప్పుడు రిలీజ్‌కు క్యూలో ఉన్నాయి. ప్రభాస్ నటించిన కల్కి సినిమా జూన్ 27 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. తరువాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ సినిమాలు బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త పవన్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తుంది.
ఇప్పటికే కల్కి, దేవర సినిమాలు రెండు సార్లు విడుదల తేదీలను మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓజీ సినిమా విడుదల తేదీని మార్చబోతున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మాస్సీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర అక్టోబర్ 10న రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ ప్రకటించింది. కానీ ఆ చిత్రం షూటింగ్ ఇంకా చివరి దశలో ఉంది. అందుకే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పుడు ఈ రెండు డేట్లు క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే దేవర పోస్ట్ పోన్ అయిన ఆక్టోబర్ 10న రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఓజీ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల చేస్తారు అనే టాక్ నడుస్తుంది. ఇక దసరకు గేమ్ ఛేంజర్ తీసుకురావాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. దీంతో దేవర సెప్టెంబర్, ఓజీ డిసెంబర్‌లో వచ్చే అవకాశం కనిపిస్తుంది.