ఆఖరికి ఫ్యామిలీని వదలరా… ఆ ఫోటో వ్యాల్యూనే 1000 కోట్ల పైనే…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి త్రీబుల్ ఆర్ తో పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ వస్తే వచ్చి ఉండొచ్చు. కాని దేవరతో అంతకుమించి మాస్ లో ఫ్యాన్ బేస్ పెరిగింది. మొన్నటి వరకు తన దేవర తాలూకు అప్ డేట్లు, సినిమా రిలీజ్ అయ్యాక, సినిమాలో సీన్లు రీల్స్ రూపంలో వైరలయ్యాయి.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 03:04 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి త్రీబుల్ ఆర్ తో పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ వస్తే వచ్చి ఉండొచ్చు. కాని దేవరతో అంతకుమించి మాస్ లో ఫ్యాన్ బేస్ పెరిగింది. మొన్నటి వరకు తన దేవర తాలూకు అప్ డేట్లు, సినిమా రిలీజ్ అయ్యాక, సినిమాలో సీన్లు రీల్స్ రూపంలో వైరలయ్యాయి. అంతలా తనకి సౌత్ ని మించేలా నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అంతవరకు బానే ఉంది. కాని ఇప్పుడు ఆ అభిమానం అక్కడితోనే ఆగలేదు. ఏకంగా తన ఫ్యామిలీ వరకు పాకుతోంది. ఫ్యామిలీని కూడా వదలట్లేదు ఫ్యాన్స్… ఎన్టీఆర్ తన కుటుంబంతో దిగిన ఫోటో ఇప్పుడు నార్త్ ఇండియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోనే సోషల్ మీడియాలో వైలరలైంది. ఇక్కడ కూడా తన ఫ్యామిలీని, ఆ ఫోటోనీ కూడా కొందరు కామెంట్లతో కుళ్లుకునే బ్యాచ్ వదల్లేదు. వాళ్లకి పంచ్ఇవ్వటంతో ఫ్యాన్స్ వెనకడుగు వేయలేదు. ఇంతకి ఫ్యామిలీ ఫోటో వెనకున్నకథేంటి?

యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాక ఎన్టీఆర్ ఇమేజ్, పాన్ ఇండియా రేంజ్ లో ఎక్కడికో వెళ్లిపోయింది. త్రిబుల్ ఆర్ తో కొంత మార్కెట్ క్రియేట్ అయితే, దేవరతో నార్త్ ఇండియా మాస్ ఆడియన్స్ అంతా గంప గుత్తగా తన ఎకౌంట్ లో పడిపోయారు. ఆరేంజ్ ఇమేజ్ దేవరతో నార్త్ లో పెరిగిపోయింది

అంతవరకు ఓకే కాని, తన పర్సనల్ ఈవెంట్స్ ని కూడా నార్త్ లో సెలబ్రేట్ చేసుకునే రేంజ్ రావటం ఆశ్చర్యంగా ఉంది. తన దేవర మూవీ ఆల్రెడీ ఉత్తర ప్రదేశ్ కేపిటల్ సిటీ లక్నౌలో 50 కోట్ల వరకు రాబట్టి చరిత్ర స్రుష్టించింది. నార్త్ ఇండియాలోనే 480 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇవన్నీ నార్త్ ఇండియాలో ఖాన్లు, కపూర్లను మించే రేంజ్ ఓ తెలుగు హీరోకి వచ్చిందని ప్రూవ్ చేసే సంఘటనలు.

అయితే దీపావళి పండక్కి తన ఫ్యామిలీతో ఎన్టీఆర్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది. తన ఇద్దరు పిల్లలు వైఫ్ తో తను దిగిన ఫోటో తన ఫ్యాన్స్ ని టచ్ చేసినట్టుంది. సౌత్ లో ఎన్టీఆర్ కే కాదు ఎవరికి ఎంత ఫ్యాన్స్ ఉన్నా, నార్త్ ఇండియన్స్ ఎమోషన్స్ వేరు. వాళ్ల ప్రేమైనా, కోపమౌనా కాస్త ఎగ్రసీవ్ గానే ఉంటుంది.

అందుకే కొమరం భీమ్ గా, దేవరగా తనని నార్త్ ఫ్యాన్స్ చూస్తున్నారు కాబట్టే, అదే కోణంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద అభిమానం చూపిస్తున్నారు. జస్ట్ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఫోటో పెడితే, లక్నో, తోపాటు భువనేశ్వర్ లో దేవర పాటకి డాన్స్ వేస్తూ, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో చూపిస్తూ, నమస్తే భాబీ అంటూ వీడియోలు పెడుతున్నారు

దేవర వచ్చి వసూల్ల సునామీ తెచ్చి నెలలు గడుస్తోంది. వచ్చే వారమే ఓటీటీలో దేవర స్ట్రీమింగ్ లోకి రాబోతోంది. అయినా దేవర తాలూకు వైబ్స్ ఇంకా అలానే ఉన్నట్టున్నాయి. ఐతే ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో మీద కూడా నార్త్ ఇండియాలో కుళ్లు బ్యాచ్ కామెంట్లకు వాడేసుకున్నట్టుంది. ఆ ఫోటో మూమెంట్ లో కూడా దేవర తమిళ, మలయాళ వసూల్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఐతే మాస్ మూవీలకు మలయాళంలో రీచ్ తక్కువ… ఆవిషయం మర్చిపోయి ఏదోలా దేవర మీద బురద చల్లాలనే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఇళా ఎన్ని చేసినా దేవర వసూళ్లని ఎక్కడా ఆపలేకపోయారు. ఇంకా ఖాన్లు, కపూర్లే బాలీవుడ్ ని ఏలాలని అనుకుంటున్నారో లేదటే సౌత్ ఇండియన్స్ కి నార్త్ లో ఇంత ఫాలోయింగ్ ఏంటా అని తట్టుకోలేకపోతున్నారేమో కాని, వాళ్లలో మార్పు రావట్లేదు

అయినా లక్నో, భువనేశ్వర్ లాంటి హార్ట్ కోర్ నార్త్ ఇండియన్ బెల్ట్ నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీకి దీవాళీ విషెస్ చెప్పే వీడయోలు రావటం గొప్ప విషయమే… ఎన్టీఆర్ ఉత్తరాదిన ఎంత చొచ్చుకెళితే ఇంతలా రెస్పాన్స్ వస్తుంది…