మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాన్స్ వేస్తే ఫ్లోర్ షేక్ అవ్వాలి. అంత వేగంగా, అంతకంటే సాలిడ్ గా మాస్ స్టెప్స్ వేయటం ఎన్టీఆర్ స్పెషాలిటి.. త్రిబుల్ ఆర్ లోనాటు నాటు పాటకి భూమి బద్దలయ్యేలా ఎన్టీఆర్,చరణ్ డాన్స్ వేశారు. వరల్డ్ వైడ్ గా ఆ పాటని తూటాలా మార్చారు. అయితే ఈ పాటలో చివరికి ఎన్టీఆరే గెలిచినట్టు.. ఇప్పుడు పాట షూట్ కాకముందే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెలుపు ఖాయమైంది. హిందీ మూవీ వార్ 2లో హ్రితిక్ తో కలిసి తను చేస్తున్న సినిమాలో కూడా పరమ నాటు సాంగ్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ ఆ పాట షూటింగ్ కి రంగం సిద్ధమైంది.. విచిత్రం ఏంటంటే ఆ పాట రిహార్సల్స్ లో ఎన్టీఆర్ బాడీలాంగ్వేజ్ కి హ్రితిక్ ఫిదా అయ్యాడు. ఓరకంగా షాక్ ఆయ్యాడు. ఇంతకి ఆపాట ఎలా ఉండబోతోంది? దాంతో నాటు నాటు పాటకి ఎందుకు కంపేరిజన్స్ వస్తున్నాయి…? ఓవరాల్ గా హ్రితిక్ లాంటి డాన్సర్ ఉన్నా కాని, ఎన్టీఆర్ డాన్స్ మూవ్ మెంట్స్ మీదే బాలీవుడ్ లో అంతగా హైఓల్టేజ్ హైప్ వస్తోంది ఎందుకు?
యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాక, ఎన్టీఆర్ ఇమేజ్, స్టామినా రెండూ కూడా మారిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో తనకి మాస్ లో పెరిగిపోతున్నఫాలోయింగ్, తన పాత హిట్ మూవీల డబ్బింగ్ వర్షన్ వ్యూస్ ని కూడా యూట్యూబ్ లో పెంచేస్తున్నాయి. తన పాత పాటలు, అందులో తన స్టెప్స్ ఇప్పుడు సోసల్ మీడియాలో రీల్స్ రూపంలో, మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో వైరలవుతున్నాయి
ఇలాంటి టైంలో మరోక నాటు నాటు పాట పడితే ఇక ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో తిరుగే ఉండదు..తెలుగు, కన్నడ మార్కెట్లో ఎన్టీఆర్ కి భయంకరమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు అంతకుమించేలా నార్త్ ఇండియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ రేంజ్ ని పెరిగిపోయింది. ఐతే ఇప్పుడు ఇలాంటి టైంలో తనకి నాటు నాటు లాంటి మరోసాంగ్ ఎదురౌతోంది
బాలీవుడ్ మూవీ వార్ 2 లో హ్రితిక్ రోషన్ తో కలిసి చిందేయబోతున్నాడు ఎన్టీఆర్. ఆల్రెడీ పాట రికార్డైంది.. ఇందులో రామయ్యా వస్తావయ్యా అంటూ తెలుగు లైన్ ని కూడా వాడబోతున్నారు. నిజానికి రాజ్ కపూర్ హిట్ క్లాసిక్స్ లో రామయ్యా వస్తావయ్యా సాంగ్ ఒకటి… ఆ లైన్ తెలుగుదే అయినా హిందీలో ఫేమస్ లైన్ అది…
ఆ లైన్ తోనే షారుఖ్ ఖాన్ జవాన్ మూవీలో మరో ట్యూన్ తో సాంగ్ పెట్టారు. ఇప్పుడు ఇంతకాలానికి మళ్లీ ఓల్డ్ సాంగ్ ని వార్ 2 లో వాడబోతున్నారు. ఆ పాట కోసం అనిరుద్ ని ఫిల్మ్ టీం సంప్రదించటం పాట రికార్డ్ అవటం, కూడా జరిగిపోయింది. ఇక ప్రజెంట్ ఈ సాంగ్ కొరియో గ్రఫీ పూర్తవటంతో, స్టెప్స్ తాలూకు రిహార్సల్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ బేసిగ్గానే క్లాసికల్ డాన్సర్ అవటం, స్పీడ్ డాన్సర్ గా మాస్ లో మంచి క్రేజ్ ఉండటంతో, ఈ పాటనీ కేవలం ఒక్కపూటలో పట్టేశాడు.. తన రిహార్సల్స్ పూర్తి చేశాడు
కాని హ్రితిక్ రోషనే ఇంకా ఈ కొత్త నాటు నాటు లాంటి సాంగ్ కి తగ్గ స్టెప్స్ ని రిహార్సల్స్ పూర్తి చేయలేకపోయాడు. తనకి డాన్స్ కొత్తకాదు. మజిల్స్ ఉన్న ఇండియన్ మైఖిల్ జాక్సన్ గా తనకి పేరుంది. చాలా ఈజ్ తో డాన్స్ చేస్తాడనే క్రేజ్ జనాల్లో ఉంది. కాని తన ఏ స్టెప్ వేసినా స్టైలిష్ గా ఉంటుందే కాని, తను మాస్ స్టెప్ప్ వేయటం ఇంతవరకు ఎవరూ చూడలేదు
వార్ 2 లో మాత్రం చాలా నాటు సాంగ్ ని డిజైన్ చేయటంతో, ఆ పాటకి ఎన్టీఆర్ వేగంగా స్టెప్స్ వేసినంత తేలిగ్గా హ్రితిక్ వేయలేకపోతున్నాడట. త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ లో చరణ్ స్టెప్స్ వేసినా, అవి స్టైలిష్ గానే ఉన్నాయి కాని, మాస్ కి కనెక్ట్ అయ్యేలా పరమ నాటుగా చేసింది ఎన్టీఆర్ ఒక్కడే.. అందుకే ఇప్పుడు నాటు నాటు లాంటి మరో సాంగ్ వార్ 2లో పెట్టడంతో, ఇదెంత సెన్సేషనౌతుందో అనంటున్నారు. వార్ మూవీలో కూడా టైగర్ ష్రాఫ్ తో కలసి హ్రితిక్ రోషన్ డాన్స్ వేస్తే శంకర్ సాంగ్ బాలీవుడ్ డాన్స్ లవర్స్ ని షేక్ చేసింది. ఇప్పుడు వార్ 2లో హ్రితిక్, ఎన్టీఆర్ ఇద్దరూ స్టెప్స్ వేస్తే భూమి బద్దలే.. కాకపోతే ఇక్కడ కూడా ఎన్టీఆర్ దే పై చేయి అయినట్టుంది.