దేవరకు భారీ ప్రమోషన్స్, బావకు తారక్ ఫోన్…!

ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బాగా వసూళ్లు వస్తాయి. హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే సినిమా ప్రమోషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 9, 2024 / 04:31 PM IST

ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బాగా వసూళ్లు వస్తాయి. హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే సినిమా ప్రమోషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా చేసే ఇంటర్వ్యూలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ అయితే అప్పట్లో ఒక సంచలనం అయింది. ఆ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి బయటపెట్టారు.

ఇప్పుడు దేవర విషయంలో కూడా ఎన్టీఆర్ ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమిళ స్టార్ హీరో సూర్యని పిలవాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే అల్లు అర్జున్ తో కలిసి కూర్చోవాలని భావిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఇటీవల స్నేహం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా బావా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ కి పుష్ప సినిమా తర్వాత ఫాన్స్ కూడా భారీగా పెరిగిన మాట వాస్తవం.

ఇది దృష్టిలో పెట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ఇంటర్వ్యూ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే యాంకర్ సుమతో కూడా చర్చలు జరిగాయట. అలాగే ఈ ఇద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ ఎవరూ లేకుండా చేస్తారని టాక్. ఇప్పటికే బన్నీతో ఎన్టీఆర్ ఫోన్ లో కూడా మాట్లాడారట. ఇక దేవర సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాను ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 5 లక్షల డాలర్లను ప్రీ రిలీజ్ కి చిత్ర యూనిట్ వసూలు చేసింది.