దేవర జాతర ముగించిన ఎన్టీఆర్, ఇక వార్ 2 కు సిద్దం…

దేవర విజయంతో ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమా నెగటివ్ టాక్ తో ఇబ్బంది పడినా చాలా నమ్మకంగా ఉన్న ఎన్టీఆర్... ఇప్పుడు తర్వాతి సినిమాలపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నట్టుగా కనపడుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.

  • Written By:
  • Publish Date - October 5, 2024 / 07:13 PM IST

దేవర విజయంతో ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమా నెగటివ్ టాక్ తో ఇబ్బంది పడినా చాలా నమ్మకంగా ఉన్న ఎన్టీఆర్… ఇప్పుడు తర్వాతి సినిమాలపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నట్టుగా కనపడుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో వార్ 2, ఎన్టీఆర్ నీల్ సినిమా, దేవర 2. దేవర 2 కి ఇంకా సమయం ఉందనే విషయం అర్ధమైంది. పుష్ప మాదిరిగా సమయాన్ని వృధా చేయకుండా ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. వార్ 2 సినిమా విషయంలో పక్కాగా ఉన్నాడు తారక్.

ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్న… ఈ సినిమాలో తన నటనతో హిందీ మార్కెట్ ను కూడా ఓ రేంజ్ లో పెంచుకునే ప్లాన్ చేస్తున్నాడు అనే చెప్పాలి. తెలుగు మార్కెట్ లో వస్తున్న సమస్యల కారణంగానో మరో కారణమో తెలియదు గాని హిందీ విషయంలో ఎన్టీఆర్ పక్కా లెక్కతో ఉన్నాడు. అందుకే దేవర ప్రమోషన్స్ కూడా అక్కడ ఎక్కువగా చేసాడు అనే చెప్పాలి. ఇక వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ త్వరలోనే పాల్గొనే అవకాశం కనపడుతోంది. ఈ సినిమా షూట్ కోసం ఇప్పటికే ఎన్టీఆర్ ముంబై కూడా వెళ్లినట్టు సమాచారం.

ఈ నెల 9 నుంచి ఈ సినిమా షూట్ మొదలుకానుందని తెలుస్తోంది. ఇక్కడి నుంచి షెడ్యూల్ బిజీగా ఉంటుందని సమాచారం. ఈ నెల మూడవ వారంలో హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ తో ఓ సాంగ్ ని షూట్ చేయనున్నారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ ఈ పాట కోసం పని చేస్తున్నారట. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 15 సందర్భంగా విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ సినిమాతో గనుక ఎన్టీఆర్ హిందీ మార్కెట్ పెరిగితే… పాన్ ఇండియాలో దుమ్ము రేపడం ఖాయం.