3000 కోట్ల టార్గెట్… 3 బాలీవుడ్ సినిమాలతో…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమయ్యేలా ఉన్నాడు. మొన్నటి వరకు ఇది సాధ్యం కాదన్నారు. నార్త్ మార్కెట్ లో ఎన్టీఆర్ కి ఎంతగా మాస్ ఫాలోయింగ్ ఉన్నా, ముంబైకి మకాం మారుస్తాడని అనుకోలేం.

  • Written By:
  • Publish Date - November 26, 2024 / 02:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమయ్యేలా ఉన్నాడు. మొన్నటి వరకు ఇది సాధ్యం కాదన్నారు. నార్త్ మార్కెట్ లో ఎన్టీఆర్ కి ఎంతగా మాస్ ఫాలోయింగ్ ఉన్నా, ముంబైకి మకాం మారుస్తాడని అనుకోలేం. కాని వరుసగా అక్కడ సినిమా మీద సినిమా సైన్ చేస్తుంటే, ఎన్టీఆర్ అక్కడికే మకాం మార్చినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఆల్రెడీ వార్ 2 మూవీ చేస్తున్నాడు. ధూమ్ 4వ సీక్వెల్ లో సూర్య బదులు తారక్ నే నెగెటీవ్ రోల్ కి తీసుకుంటున్నారని ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యింది. వార్ 2 లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కి నిర్మాత ఆదిత్య చోప్రా ఫిదా అయ్యాడని, ధూమ్ 4 తో పాటు మరో ప్రాజెక్ట్ మీద డిస్కర్షణ్ ఫైనల్ స్టేజ్ కొచ్చిందని తెలుస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ మేకింగ్ లో ఎన్టీఆర్ మూడో మాస్ హిందీ మూవీకి సర్వం సిద్దమౌతోంది.. మొత్తంగా 3 వేల టార్గెట్ తో ఎన్టీఆర్ మరే తెలుగు హీరో చేయని సాహసం చేస్తున్నాడు.

త్రిబుల్ఆర్, దేవర రెండూ కూడా పాన్ ఇండియా హిట్లే.. బేసిగ్గా ఇలా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా, హిట్లు సొంతమైనా, మళ్లీ పాన్ ఇండియా మూవీలే తీస్తారు కాని, హిందీలో ఎంట్రీ ఇవ్వాలని ఏ హీరో అనుకోడు.. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేశముదురు కాదు, విశ్వముదురు..

అందుకే నార్త్ ఇండియాలో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన వెంటనే, వరుసగా హిందీ సినిమాలు చేసి, మరింతగా అక్కడి జనాల్లోకి చొచ్చుకుపోవాలనుకుంటున్నాడు. అందుకోసమే వార్ 2 లో విలన్ గా చేస్తున్నాడు. అంతవరకు ఓకే. కాని అది కాకుండానే మరో రెండు సినిమాలనుకు తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే షాకింగ్ నిర్ణయం

వార్ 2 షూటింగ్ జనవరిలో పూర్తవుతుంది. ఆ తర్వాత అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లోనే దూమ్ 4 తెరకెక్కబోతోంది. అందులో రణ్ బీర్ కపూర్ హీరో అయితే, సూర్య విలన్ అన్నారు. విచిత్రం ఏంటంటే ఇందులో సూర్య ప్లేస్ లో ఎన్టీఆర్ ని తీసుకోవాలని యష్ చోప్రా బ్యానర్ ఓనర్ ఆదిత్య చోప్రా ఫిక్స్ అయ్యాడు. వార్2 రషెస్ చూసిన తనకి, ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ నచ్చే, ధూమ్ 4లో తనని సూర్య బదులు తీసుకుంటున్నారన్నారు

కట్ చేస్తే, ఇప్పుడు మరో మూవీకి కూడా ఎన్టీఆర్ ని ప్రెజరైజ్ చేస్తున్నాడట ఆదిత్య చోప్రా… వార్ 1 మూవీ తీసిన సిద్దార్థ్ ఆనంద్ మేకింగ్ లో మరో మాస్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారట. అందులో హీరోగా చేయాలంటూ ఆదిత్య ఆఫర్ ఇవ్వటంతో, వార్ 2 నటుడిగా ఎన్టీఆర్ కి మొదటి హిందీ సినిమా అయితే, హీరోగా సిద్దర్ధ్ ఆనంద్ మూవీ మొదటి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది

తారక్ సోలోగానే 500 కోట్ల నుంచి 800 కోట్ల వరకు రాబట్టగలడని, దేవరతో ప్రూవ్ అయ్యింది.సో వార్ 2 లో హ్రితిక్ కూడా ఉన్నాడు కాబట్టి ఇది 1000 కోట్లు రాబడుతుంది. తర్వాత ధూమ్ 4 వెయ్యికోట్ల రాబట్టే ఛాన్స్ ఉంది. ఆతర్వాత పటాన్ తో 1000 కోట్లురాబట్టిన దర్శకుడు సిద్దార్థ్ మేకింగ్ లో మూవీ అంటే అది కూడా ఈజీగా 1000 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఇలా హిందీ సినిమాలతో మూడు సార్లు 3 వేల కోట్లు కొల్లగొట్టే గట్టిస్కెచ్చే వేసి బీటౌన్ లోనే తిష్టవేసేలా ఉన్నాడు తారక్. ఇంతవరకు ఓకే కాని, ఇలా వరుసగా హిందీ మూవీలు చేస్తూ పోతే, డ్రాగన్, దేవర 2 పరిస్థితేంటనే ప్రశ్నలు ఎదురౌతున్నాయి.