మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది. దేవర విడుదలైన మొదటి రోజే దేశంలో కొన్ని గనతలు సాధించిన హీరోల్లో తను నాలుగో వాడయ్యాడు. విచిత్రం ఏంటంటే దేవర హిట్ అయ్యిందా? పాన్ ఇండియా లెవల్లో వెయ్యికోట్లు వచ్చాయా, అన్న లెక్కలు తేలేదు. అయినా రెబల్ స్టార్ ప్రభాస్, తర్వాత స్థానం తనదే అని డిక్లేర్ చేశారు. మొదటి రోజు వసూళ్లే అందుకు కారణం. కేవలం ఓపెనింగ్స్ బాగుంటే, గొప్ప హీరో అవుతాడా అంటే, లేదు.. అసలు అది క్రైటీరియానే కాదు. నిజం చెప్పాలంటే మొదటి రోజు వసూళ్ల కంటే, ఫస్ట్ డే ఒక విషయంలో హీరో ఒక రికార్డు క్రియేట్ చేస్తే చాలు, తనే పాన్ ఇండియా కింగ్. ఇంతకి ఆరికార్డేంటి? ప్రభాస్ తర్వాత ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లున్నా, ఎన్టీఆర్ కే ఆస్థానం ఎందుకు దక్కింది. ఇండియాలో అలాంటి ఘనత సాధించిన నాలుగో హీరో ఎన్టీఆర్ అంటే ఆమిగతా ముగ్గురెవరో చూసేయండి.
భారత దేశం మొత్తం ఓ సినిమాకోసం వేయిట్ చేసే రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్స్ ఎవరైనా ఉన్నారంటే నలుగురే. దానికో లెక్కుంది. అందులోకి వెళ్లేముందు దేవర సినిమాతో గత 24 గంటల్లో భారీ హైప్ తీసుకు రాగలిగింది దేవర టీం. పాన్ ఇండియా టాప్ డైరెక్టరో, టాప్ హీరోయినో లేకున్నా, కేవలం ఎన్టీఆరే మొత్తం సినిమాను తన భుజాల మీద మోసుకుంటూ పోయాడు
తన క్రేజ్ మీదే సినిామ సౌత్, నార్త్ లో దూసుకెళుతోంది. అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో మొదటి రోజే వందకోట్ల వసూళ్లు రాబట్టిడం, అలాంటి సినిమాలు తన కెరీర్ రెండు మూవీలు ఉండటం అనేది రేర్ గా వచ్చే రికార్డు.
ఆరికార్డే దేవర మూవీతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దక్కింది. రాజమౌళి మేకింగ్ లో రామ్ చరణ్ తోకలిసి ఎన్టీఆర్ చేసిన త్రిబుల్ ఆర్ మూవీకి దేశవ్యాప్తంగా మొదటి రోజు 100 కోట్ల వసూళ్లు దాటాయి. ఇప్పుడు దేవరతో మరోసారి వందకోట్ల ఓపెనింగ్స్ తో రెండు సార్లు మొదటి రోజే సెంచరీ కొట్టిన రికార్డుగా చరిత్రలో నిలిచిపోయాడు ఎన్టీఆర్
ఇలాంటి ఫీట్ ఇండియాలో నలుగురంటే నలుగురు హీరోలకే సాధ్యమైంది. ముందు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా బాహుబలి 2 కి ఇలాంటి రికార్డు వచ్చింది. తర్వాత సాహో, ఆదిపురుష్, సలార్, కల్కీ ఇలా ఐదు సినిమాలతో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు
ఆతర్వాత లిస్ట్ లో చూస్తే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పటాన్, జవాన్ రెండు సినిమాలతో రెండు సార్లు వందకోట్ల ఓపెనింగ్స్ తో రికార్డు క్రియేట్ చేశాడు. ఇక తమిళ స్టార్ విజయ్ తన బీస్ట్,లియో సినిమాలతో వందకోట్ల ఓపెనింగ్స్ తో ఈ క్లబ్ లోచేరాడు
విచిత్రం ఏంటంటే షారుఖ్ ఖాన్ పటాన్, జవాన మూవీలు హిందీలో అలానే ఓవర్ సీస్ వసూళ్లతో వందకోట్లు రాబట్టాయి. తమిళ స్టార్ విజయ్ కి ఇలాంటి రికార్డులు తమిల మార్కెట్ తోనే సాధ్యమైంది కాని, విజయ్ సినిమాలు నార్త్ లో పెద్దగా ఆడలేదు. షారుఖ్ సినిమాలు సౌత్ లో పెద్దగా ఆడలేదు. కాబట్టి వీళ్లవి పాన్ ఇండియా హిట్లనలేం…
అదే ప్రభాస్ సినిమాలు, అలానే త్రిబుల్ ఆర్ తో పాటు దేవర మూవీ పాన్ ఇండియా లెవల్లో అన్ని ఏరియాల్లో భారీగా ఓపెనింగ్స్ రాబట్టి, 100 కోట్ల క్లబ్ లో చేరింది. సో అలా చూస్తే, రెండు సార్లు 100 కోట్ల ఓపెనింగ్స్ తోపాన్ ఇండియాని షేక్ చేసిన హీరోల్లో ప్రభాస్ తర్వాత ప్లేస్ ఎన్టీఆర్ దే అవుతుంది… ఆ కోణంలో, షారుఖ్, విజయ్ దళపతిని కూడా వెనక్కి నెట్టాడు ఎన్టీ ఆర్. అంతేకాదు, కేజీయఫ్ హీరో యష్, పుష్ప స్టార్ బన్నీ, ని కూడా వెనక్కి నెట్టి రికార్డుల జర్నీ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్