ఏమైనా ప్లానింగా… మల్లూ అర్జున్ లానే తమిళ టైగర్ గా ఎన్టీఆర్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మామూలుగానే ముదురనే పేరుంది. పెర్ఫామెన్స్, డాన్స్ తోపాటు మంచి మాటకారి... అలానే స్టోరీ సెలక్సన్ నుంచి మేకింగ్ వరకు కొంత అవగాహన, ఇంకొంత టేస్ట్ ఉన్న హీరో అంటారు.

  • Written By:
  • Publish Date - September 21, 2024 / 08:31 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మామూలుగానే ముదురనే పేరుంది. పెర్ఫామెన్స్, డాన్స్ తోపాటు మంచి మాటకారి… అలానే స్టోరీ సెలక్సన్ నుంచి మేకింగ్ వరకు కొంత అవగాహన, ఇంకొంత టేస్ట్ ఉన్న హీరో అంటారు. అయితే ఇప్పుడు నార్త్ ఇండియా లో తనకున్న క్రేజ్ ని పెంచుకునే పనిచేస్తున్న తారక్, ఏ తెలుగు హీరో చేయని పని తమిళ నాడులో చేస్తున్నాడు. మల్లూవుడ్ లో అల్లు అర్జున్ ని ఎలాగైతే క్రేజ్ సొంతమైందో, అలాంటి క్రేజ్ ని కోలీవుడ్ లో క్రియేట్ చేసుకుంటున్నాడా? మిగతా హీరోల వల్ల కానిది ఎన్టీఆర్ వల్ల ఎలా అవుతోంది. అరవ అడ్డాలో నిజంగా తారక్ ఫ్యాన్ బేస్ పెరుగుతోందా? అందుకోసం తానేం చేశాడ? ఏం చేస్తున్నాడు..?

ఎన్టీఆర్ అప్రోచ్ కి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్రోచ్ కి డిఫరెన్స్ ఉంది. ఇద్దరి దారి వేరే… కాకపోతే ఒక విషయంలో ఇద్దరి స్ట్రాటజీ ఒకేలాఉంటోంది. అదే పొరుగింట్లో సొంతింటి అల్లుడిలా తిష్ట వేయటం.. ఈ విషయంలో ఎప్పుడో అల్లు అర్జున్ కేరళాలో ఫ్యాన్ బేస్ ని,మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. మల్లూ అర్జున్ గా మారాడు…

తన ప్రతీ మూవీ ప్రమోషన్ నుంచి మలయాళం మార్కెట్ లో ఏం జరిగినా రియాక్ట్ అవుతూ, మల్లూజనాలకు దగ్గరవుతూ వస్తున్నాడు. అచ్చంగా అదే పనిని తమిళ నాడులో చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..

అంటే అల్లు అర్జున్ ని కాపీ కొట్టడం కాదు, తను దేశముదురైతే, తారక్ విశ్వముదురనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సౌత్ లో మలయాళం మార్కెట్ తో పోలిస్తే తమిళ మార్కెట్ పెద్దది. తెలుగుతర్వాత అంత పెద్ద మార్కెట్ సౌత్ లో ఉందంటే అది కోలీవుడ్డే.. అందుకే అక్కడ అరవింద సమేత వీరరాఘవ నుంచే మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు

తమిళ్ లో అనర్గలంగా మాట్లాడటమే కాదు, అక్కడి మీడియా, అక్కడి దర్శకులు, అక్కడి రచయితలు ఇలా అందరి గురించి మాట్లాడుతూ, అరవోళ్లే షాకయ్యేలా చేస్తున్నాడు. వెట్రిమారన్ మేకింగ్ లో సినిమా చేసేందుకు రెడీ అని, అరవోళ్లు ఎక్కువ ఇష్టపడే దర్శకుడికే ఆఫర్ ఇవ్వటం కాదు, తమిళ స్టార్ విజయ్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకునేలా స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు. త్రిబుల్ ఆర్ రిలీజ్ టైంలో అదే పనిచేశాడు. ఇప్పుడు దేవర రిలీజ్ టైంలో కూడా తమిళ తంబీలను మచ్చిక చేసుకోవటం కాదు, అక్కడ ఫ్యాన్స్ తాలూకు అధ్యక్షుడిని ఎంచుకోవటమే కాదు, తన ఫ్యాన్ క్లబ్ ని యాక్టివ్ గా ఫాలో అప్ చేస్తున్నాడు. ఇది వింటానికి కాస్త పొలిటికల్ గా అనిపిస్తుంది కాని, ఓ స్టార్ హీరోకి ఫ్యాన్ బేస్ ఎంతగా బాక్సాఫీస్ దగ్గర కలిసొస్తుందో ప్రాక్టికల్ గా తెలుసు కాబట్టే, తారక్ కోలీవుడ్ లో ఏ తెలుగు హీరోకి సాధ్యంకాని ఫీట్ చేస్తున్నాడు.