మార్చ్ లోనే మూర్చ… సెట్లో డ్రాగన్, లొకేషన్ లో సూపర్ మ్యాన్ ..

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి సినిమా మార్చ్ లోనే మొదలు కాబోతోందనంటున్నారు. కాస్త్ డిలే కూడా అవ్వొచ్చని కూడా మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఒకే రోజు ఒకే ముహుర్తానికి ఒకే లొకేషన్ లో ఇద్దరు టాప్ స్టార్ల సినిమాలు మొదలు కాబోతున్నాయి.

  • Written By:
  • Publish Date - November 26, 2024 / 03:35 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి సినిమా మార్చ్ లోనే మొదలు కాబోతోందనంటున్నారు. కాస్త్ డిలే కూడా అవ్వొచ్చని కూడా మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఒకే రోజు ఒకే ముహుర్తానికి ఒకే లొకేషన్ లో ఇద్దరు టాప్ స్టార్ల సినిమాలు మొదలు కాబోతున్నాయి. త్రిబుల్ ఆర్, దేవరతో రెండు సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన ఎన్టీఆర్
వార్ 2 షూటింగ్ పూర్తయ్యాక డ్రాగన్ గా మారబోతున్నాడు.మార్చ్ నుంచే రెగ్యులర్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. తను లేని సీన్లను తీస్తూ ప్రశాంత్ నీల్ కొంతవరకు ఈ గ్యాప్ టైంని యుటిలైజ్ చేసుకుంటున్నాడు. ఐతే ఇక్కడ కో ఇన్స్ డెన్స్ ఏంటంటే, డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే మొదలు కాబోతోంది. అదే రోజు అదే లొకేషన్ లోని పక్క ఫ్లోర్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా సెట్స్ పైకెళ్లబోతోంది. ఇంకా ఈ రెండు సినిమాల్లో కామన్ ఇష్యూస్, ఇంకా షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

ఒకరు రెండు పాన్ ఇండియా హిట్స్ తో మాస్ మార్కెట్ ని షేక్ చేసిన హీరో.. ఇంకొకరు సూపర్ స్టార్ ఇమేజ్ తో ఇప్పుడు రాజమౌళి మేకింగ్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న హీరో.. ఈ ఇద్దరి సినిమాలు ఒకే లొకేషన్ లో, ఒకే ముహుర్తానికి షురూ అయితే, అది నిజంగా వార్తే.. అదే జరుగుతోంది. ఉగాది స్పెషల్ అకేషన్ కి రామోజీ ఫిల్మ్ సిటీలో పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ సినిమాలకు ఒకే లోకేషన్ కలిసొచ్చేలా ఉంది

కేజీయఫ్1, కేజీయఫ్ 2, సలార్ ఇలా వరుసగా మూడు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమానే డ్రాగన్. ఆల్రెడీ లాంచై, హీరో లేని సీన్ల షూటింగ్ జరుగుతోంది. వార్2 షూటింగ్ తో బిజీ అయిన ఎన్టీఆర్, జనవరిలోనే ఆ ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఫిబ్రవరిలో కాస్త రిలాక్స్ అవుతాడట.

తర్వాత మార్చ్ నుంచే డ్రాగన్ రెగ్యులర్ షూటంగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలౌతుందని, అప్పుడు షూటింగ్ తో మ్యాన్ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. 2025 మార్చ్ 30 నుంచే డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ ఆర్ ఎఫ్ సీ లో మొదలు కాబోతోంది.

ఇక ఎగ్జాక్ట్ గా మార్చ్ 30 కే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా కూడా సెట్స్ పైకెళ్లేలా ఉంది. నిజానికి సంక్రాంతికి ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ప్రచారం జరిగింది. కాని హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాకే ఫిల్మ్ టీం నిర్ణయం తీసుకోలేదట. తను కూడా ఫైనల్ అయితేనే, ఇంకా వర్క్ షాపులు పూర్తయ్యే ఛాన్స్ఉంది

ఈవిషయంలో ఇండోనేసియా మూలాలతో అమెరికాలో సెటిలైన చెల్సియా ఆల్ మోస్ట్ హీరోయిన్ గా కన్పామ్ అయ్యేలా ఉంది. మొన్నటి వరకుగుసగుసలకే పరిమితమైన పేరు ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫామ్ అయ్యేలా ఉందట. ఏదేమైనా మార్చ్ 30కి ఒకే రోజు ఉదయం ఒకే ముహుర్దం అయిన పదిన్నరకి, ఒకే లొకేషన్ అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో పక్క పక్క ప్లోర్స్ లోనే డ్రాగన్, అలానే మహేశ్ బాబు సినిమాల రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వటం కోఇన్స్ డెన్సే అయినా, కిక్ ఇచ్చే వార్తే.