దేవరగా కొమరం భీమ్ సునామీ తెచ్చాడు.. మరి రామ్…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాడు. ఓటీటీ ని షేక్ చేస్తున్నాుడు. బాక్సాఫీస్ లో అలానే ఓటీటీలో రెండు చోట్ల అరవ తంబీలకు అరుపు లేకుండా చేశాడు.త్రిబుల్ ఆర్ తర్వాత కొమరం భీముడు నిజంగా దేవరగా మారి బాక్సాఫీస్ బీముడని ప్రూవ్ చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - November 11, 2024 / 07:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాడు. ఓటీటీ ని షేక్ చేస్తున్నాుడు. బాక్సాఫీస్ లో అలానే ఓటీటీలో రెండు చోట్ల అరవ తంబీలకు అరుపు లేకుండా చేశాడు.త్రిబుల్ ఆర్ తర్వాత కొమరం భీముడు నిజంగా దేవరగా మారి బాక్సాఫీస్ బీముడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్ప్డుడు మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ వంతొచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్ తాలూకు షార్ట్ ప్రోమోపేలింది. టీజర్ తో గేమ్ ఛేంజ్ అయ్యే లా ప్రమోషన్ ని ఫిల్మ్ టీం పెంచింది. దేవర మూవీ 50 కోట్లు రాబట్టిన లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ తో లెక్కే మారింది. మరి కొమరం భీముడికి కలిసొచ్చిన సిటీ, గ్లోబల్ రామ్ ఫేట్ మారుస్తుందా? సెంటిమెంటల్ గా ఆ నగరం రామ్ చరణ్ ఫేట్ మార్చే ఛాన్స్ ఉందా?

త్రిబుల్ ఆర్ మూవీలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, రామ్ గా రామ్ చరణ్ కనిపించారు. కలిసి గ్లోబల్ గా నాటు పాటతో తూటా పేల్చారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి, త్రిబుల్ ఆర్ ని మించేలా దేవర పాత్రలో మాస్ మతిపోగొట్టాడు. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసి, హిస్టరీ క్రియేట్ చేశాడు

బాక్సాఫీస్ లో కోట్లలో వసూళ్లు రాబట్టి, ఇప్పుడు ఓటీటీలో వ్యూస్ రాబట్టేస్తున్నాడు. డిజిటల్ ప్లాట్ ఫాంలో కూడా సినీ సునామీ తీసుకొచ్చాడు. వెట్టయాన్, గోట్, భారతీయుడు 2 మాత్రమే కాదు, ఓటీటీని మొన్నటి వరకు ఏలిన సత్యం సుందరం మూవీ వ్యూస్ కి కూడా గండి కొట్టి, అక్కడ కూడ అరవ తంబీలకు షాక్ ఇచ్చాడు.. అలా తను దూసుకెళుతుంటేఇప్పుడు రామ్ చరణ్ వంతొచ్చింది

త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ఆచార్యతో పంచ్ పడటంతో, రాజమౌళి సెంటిమెంట్ కి బలయ్యాడన్నారు. కాని అది పూర్తిగా తన సినిమాకాదు. తన తండ్రి మూవీలో గెస్ట్ రోల్ మాత్రమే చేశాడు. కాబట్టి త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ మూవీ అంటే గేమ్ చేంజర్ గానే కన్సిడర్ చేస్తున్నారు

ఆలెక్కన త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌలి సెంటిమెంట్ ని గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందా లేదా సంక్రాంతికి తేలబోతోంది. టీజర్ పేలింది. చరణ్ లుక్ కిక్ ఇస్తోంది. కాని దేవర రేంజ్ లో మాత్రం మాస్ ఆడియన్స్ అటెన్షన్ ని లాక్కునే కంటెంటే కాస్త తగ్గిందంటున్నారు. ఇందులో హీరో పాత్రమరీ క్లాస్ అయినా, మేకింగ్ మాస్ మతిపోగొట్టేలా ఉంటే, చెప్పలేం. అది ట్రైలర్ తోనే తెలుస్తుంది. ఏదేమైనా దేవర తో ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసి, పరిక్ష పాసవ్వటం కాదు, డిస్టింక్షన్ లో షాక్ ఇచ్చాడు. ఇక మిగిలింది చరణ్ వంతే..