ఎన్టీఆర్ ని కసితీరా తిట్టినోడే.. ఇప్పుడు బన్నీకి కొండంత అండ..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండలేదు. అసలు త్రిబుల్ ఆర్ రిలీజ్ అవకముందు ఎన్టీఆర్ ని బాడీ షేమింగ్ చేసి, ఆల్ మోస్ట్ కోర్టు మెట్లెక్కే వరకు పరిస్థితిని దిగాదార్జాడు.. అలాంటి వ్యక్తి సడన్ గా సౌత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తాడు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 05:20 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండలేదు. అసలు త్రిబుల్ ఆర్ రిలీజ్ అవకముందు ఎన్టీఆర్ ని బాడీ షేమింగ్ చేసి, ఆల్ మోస్ట్ కోర్టు మెట్లెక్కే వరకు పరిస్థితిని దిగాదార్జాడు.. అలాంటి వ్యక్తి సడన్ గా సౌత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తాడు. తనని మెగా బ్యాచ్ తొక్కేస్తుందంటున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద సగం పాజిటివ్ గా, సగం నెగెటీవ్ గా రియాక్ట్ అయ్యాడు. ఇవన్నీ కాదు, అసలు బన్నీనే బాలీవుడ్ లో సైడ్ రోల్ కి పనికి రాడని, కసితీరా తిట్టినోడు, ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ మీద ప్రేమ కారుస్తున్నాడు. ఇంతకి ఎన్టీఆర్ ని త్రిబుల్ ఆర్, దేవర టైంలో ఫ్యాన్స్ రక్తం మరిగేలా కామెంట్స్ చేసి, ఇప్పుడు తీరిగ్గా బన్నీకి సపోర్ట్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? తనకి కౌంటర్స్ ఎలా పడుతున్నాయి?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని అసలు హీరోనే కాదన్నాడో పరాన్న జీవి… హీరోలని తిడితేనో, వాళ్ల మూవీలు ప్లాప్ అని నోటికొచ్చినట్టు వాగితేనో, జనాలు ఎక్కువగా తనని పట్టించుకుంటారనే కన్నింగ్ స్ట్రాటజీతో, సాధ్యమైనంత వరకు తోపు స్టార్ అనుకున్న ప్రతీ హీరోని టార్గెట్ చేస్తాడు కమల్ ఆర్ ఖాన్… ఈ నార్త్ ఇండియన్ రివ్యూ స్పీకర్… అనేకంటే తలా తోకలేని ఎనాలసిస్ పేరుతో, బాడీ షేమింగ్ చేసే రాక్షస పద్దతి పాటించే వ్యక్తి అనొచ్చు..

ఇది ఒక్కసారికాదు చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఎన్టీఆర్ ని ఎలుగుబంటితో పోల్చిన ఆ నీచమైన యూ ట్యూబర్ కూడా తనే… కమర్ ఆర్ ఖాన్ నిజానికి ఖాన్లు, కపూర్లని కూడా వదల్లేదు.. ఇలా తిడితేనే, ఆహీరోల ఫ్యాన్స్ తనని తిడుతూ, తన వీడియోల వ్యూస్ పెంచుకోవచ్చనేది తన టార్గెట్..

కాని అదే ఓ సారి మిస్ ఫైర్ అయ్యింది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ రిలీజ్ కి ముందు కూడా ఇలానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఎలుగుబంటిలా ఉన్నాడు,తనేం కొమరం భీముడంటూ నోటికొచ్చినట్టు వాగితే, ముంబై ఏయిర్ పోర్ట్ లో ఓసారి తారక్ ఫ్యాన్స్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు

సోషల్ మీడియాలో అయితే కమల్ ఆర్ ఖాన్ మీద సునామీలా కామెంట్లతో దాడి చేసే సరికి తోక ముడుచుకున్నాడు. మధ్యలో సల్మాన్ అండ్ కో మీద ఇలానే చేస్తే సీన్ కోర్టు వరకెళ్లి తన చానెల్ మూసేసే వరకు సీన్ మారింది.

ఇలాంటి వ్యక్తి సడన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేశ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ పుష్ప 2 మీద ఎటాక్ చేస్తున్నారన్నాడు. మెగా హీరోలైన చిరు, పవన్, రామ్ చరణ్ ఇప్పుడు బన్నీని తొక్కేసేందుకు తెగ కష్టపడుతున్నారనే మీనింగ్ వచ్చేలాట్వీట్ చేశాడు. పుష్ప2 ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి కుళ్లుకుంటున్న మెగా హీరోలు, కనీసం రెస్పాండ్ కూడా కావట్లేదని కెలికాడు

విచిత్రం ఏంటంటే ఈ కమర్ ఆర్ ఖానే గతంలో పుష్ప వస్తే, తనేం హీరో, తనకంటే బస్టాండ్ లో కూలి బెటర్ అన్నాడు. బాలీవుడ్ లో హీరో అంటే ఆరడుగులుండాలి, ఫేర్ గా కనిపించాలి.. కాని ఇలా మాసిన కూలీలా ఉన్నోడు హీరోనా అంటూ చులకనగా మాట్లాడాడు.. అలాంటి తను బన్నీకి సపోర్ట్ చేయటం కాదు, మెగా హీరోల మీద వంకర మాటలు పేలటంతో, అటుమెగా ఫ్యాన్స్ తగులుకున్నారు. ఇటు గతంలో ఎన్టీఆర్ మీద నోరుజారినందుకు, గుర్తొచ్చిన ప్రతీ సారి మ్యాన్ ఆఫ్ మాసెస్ అభిమానులు కూడా సోసల్ మీడియాలో ఇచ్చి పడేస్తున్నారు.