ఎన్టీఆర్ డ్రాగన్… ప్రభాస్ స్పిరిట్… ఆ లుక్కేంటీ బాబోయ్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా మారిపోబోతున్నాడు. డ్రాగన్ కి అస్సలు లుక్ మార్చాల్సిన పనిలేదంటూ ప్రశాంత్ నీల్ అన్నట్టు వార్తలొచ్చినా, మళ్లీ ఇప్పుడు నిర్ణయాలు మారినట్టున్నాయి.

  • Written By:
  • Publish Date - November 24, 2024 / 01:14 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా మారిపోబోతున్నాడు. డ్రాగన్ కి అస్సలు లుక్ మార్చాల్సిన పనిలేదంటూ ప్రశాంత్ నీల్ అన్నట్టు వార్తలొచ్చినా, మళ్లీ ఇప్పుడు నిర్ణయాలు మారినట్టున్నాయి. అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్ తో, త్రిబుల్ ఆర్ లో భారీ మజిల్స్ తోకనిపించిన ఎన్టీఆర్ ఈ సారి తన లుక్ మార్చుకునేందుకు హాలీవుడ్ స్టూడియోకి వెళ్లబోతున్నాడు. మామూలుగా సూపర్ హీరోల డ్రెస్ విషయంలోనే అక్కడకి ఎవరైనా వెళతారు.. కాని ఎన్టీఆర్ లుక్ కి హాలీవుడ్ సంస్థలకి లింకేంటి? ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లోకూడా పూనకాలు వచ్చేలా స్పిరిట్ లో ప్రభాస్ లుక్ షాక్ ఇవ్వబోతోంది. ఆల్రెడీ తను వేసేది పోలీస్ పాత్రే అని తెలుసు కాని, తన లుక్ ఎలా ఉంటుందో మాత్రం రివీల్ కాలేదు. ఐతే సందీప్ రెడ్డి ప్లానింగ్ వల్ల అది కూడా కొంచెం కొంచెం రివీల్ అవుతోంది.. అదేంటో చూసేయండి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీని లాంచ్ చేసిన ప్రశాంత్ నీల్, ఆల్రెడీ హీరోలేని సీన్లను తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం హిందీ మూవీ వార్ 2 షూటింగ్ ని పూర్తి చేసే ప్రాసెస్ లో ముంబైకే పరిమితమయ్యాడు. అక్కడే ఫుల్ బిజీ అయ్యాడు. అయితే దీనికి స్పెసిఫిక్ కారణం ఉంది. వార్ 2 షూటింగ్ షెడ్యూల్స్ గ్యాప్ లోహైద్రబాద్ తిరిగి వచ్చే అవకాశం ఉన్నా తను రాకపోవటానికి రీజన్, తను కొత్త లుక్ కోసం ముంబై లో హేయిర్ స్టైలిస్ట్ సాయం తో ప్రిపేర్ అవటమే

అంతేకాదు డిసెంబర్ లో ఒక వారం యూఎస్ లో యూనివర్సల్ స్టూడియో కి వెళుతున్నాడట. అలానే సూపర్ హీరోల సినిమాలు చేసే ఏ హీరో అయినా తన కాస్ట్యూమ్ తోపాటు లుక్ కోసం హాలీవుడ్ స్టూడియోలకి వెళ్లటం కామన్. ఈసారి ఎన్టీఆర్ వంతొచ్చింది. అలాని డ్రాగన్ మూవీ సూపర్ హీరో జోనర్ లో తెరకెక్కే సినిమాకాదు.

అయినా సూపర్ హీరో రేంజ్ లుక్ కోసం ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేశాడట. డ్రాగన్ లో కొత్త అవతారం లోకనిపించేందుకు ఎన్టీఆర్ తన లుక్ ని మార్చుకోబోతున్నాడు.హేయిర్ విషయంలో ముంబై స్టైలిష్ట్ గైడెన్స్ తీసుకుంటున్నాడట తారక్. పాన్ ఇండియా లెవల్లో ఏ హీరో అయని గెటప్పులు చాలా వేయొచ్చు. కాని కమల్ హసన్, విక్రమ్ నే మించేలా తన బాడీ మీదే కబాడి ఆడిన స్టార్ ఎన్టీఆర్

బొద్దుగా ఉండే తాను యమదొంగ టైంలో సన్నబడ్డాడు. టెంపర్ లో మజిల్స్ తో భయపెట్టాడు.
అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్ తో షాక్ ఇచ్చాడు. ఇక త్రిబుల్ ఆర్ లో కొమరం భీం పాత్రకు తగ్గ బలశాలిగా కండలతో కనిపించాడు. దేవరలో గంభీరంగా కనిపించేలా తన హేయిర్ స్టైల్ నిమేయింటేన్ చేశాడు. ఇప్పుడు అంతకు మించేలా డ్రాగన్ లోతన పాత్ర కోసం లుక్ మారుస్తున్నాడు. తనే కాదు రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ కూడా షాక్ ఇచ్చేలా ఉండబోతోందట.

ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ అంటేనే ఫ్యాన్స్ లోపూనకాలు మొదలయ్యాయి. అర్జున్ రెడ్డిలో విజయ్, కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్, యానిమల్ లో రణ్ బీర్ ఎన్ని గెటప్స్ లో కనిపించారో చూశాం. సో సందీప్ రెడ్డి మూవీలో హీరో అంటే కనిసం అరడజన్ లుక్కులైనా ఉండాలి… ఆలెక్కన స్పిరిట్ లో ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ గానే కాదు, అంతకు మించే లుక్ లో కనిపిస్తాడట. ఏకంగా ఎనిమిది గెటప్స్ సంబంధించి ప్రభాస్ తో చర్చలు జరగాయని, ది రాజా సాబ్ షూటింగ్ తర్వాత వన్ వీక్ ప్రభాస్ లుక్ మీదే ప్లానింగ్ ఉంటుందని తెలుస్తోంది. బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ ని అతి వీర భయంకరమైన మజిల్స్ తో చూడ్డం మాత్రం స్పిరిట్ లో కన్ఫామ్ అన్న సమాచారం మాత్రం కన్ఫామ్ అయ్యంది.