దేవర సినిమా ఏమో గాని… ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లు వేరే లెవెల్ లో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. సినిమా ఫ్లాప్ అవుతుందనే టాక్ ఒక పక్క ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఊహకు మించి జరగబోతున్న ప్రమోషన్ లు ఇప్పుడు మరింత భయాన్ని పెంచుతున్నాయి. కొరటాలను మెగా ఫ్యాన్స్ టార్గెట్ ఒక పక్కన చేసి ఒత్తిడి పెంచుతుంటే సెంటిమెంట్ భయంలో ఎన్టీఆర్ ఉన్నాడు. దానికి తోడు కాపీ అనే మాట ఒకటి తలనొప్పిగా మారింది. సినిమా విడుదలకు ముందు నెగటివ్ ఎనర్జీ వస్తోంది.
అందుకే కన్నడ హిందీ మార్కెట్ మీద ఎన్టీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టి పావులు కదుపుతున్నాడు. అగ్ర హీరోల ఫ్యాన్స్ తన సినిమా చూసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తో కలిసి ప్రమోషన్ చేయాలని కూడా భావిస్తున్నాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కూడా దృష్టి పెట్టాడు ఇప్పుడు. ఇక కొత్తగా భారీ ప్లాన్ సిద్దం చేస్తున్నాడు. ప్రభాస్ తో కలిసి సినిమా చూడాలని భావిస్తున్నాడు. ఇందుకోసం ఒక ప్రముఖ థియేటర్ లో స్పెషల్ షో వేయించేందుకు నిర్మాతలను కూడా ఒప్పించాడు ఎన్టీఆర్. ప్రభాస్ కూడా దీనికి అంగీకరించాడు అని టాక్.
త్వరలోనే సినిమా విడుదల కానున్న నేపధ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా దగ్గర చేసుకునే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య కాలంలో తన సినిమాలతో పాటు ఇతర సినిమాలను కూడా ప్రభాస్ ప్రోత్సహిస్తున్నాడు. దేవర చూసిన తర్వాత ఎలాంటి కామెంట్ చేస్తాడో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక చంద్రబాబుని కలవడం ద్వారా టీడీపీ కార్యకర్తలకు గురిపెట్టాడు. త్వరలో రేవంత్ రెడ్డిని కూడా ఎన్టీఆర్ కలుస్తున్నాడు. విరాళం చెక్ ను అందించేందుకు సిద్దమయ్యాడు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ మీద ఎన్టీఆర్ పెట్టిన ఫోకస్ మాత్రం సంచలనం అవుతోంది.