ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. కొరటాల శివ, అతని టీం లొకేషన్లు ఖరారు చేసేందుకు కొంత సమయం తీసుకోవడంతో.. కాస్త ఆలస్యంగా మూవీ స్టార్ట్ అయింది. సికింద్రాబాద్‌లోని ప్యాలెస్‌లో షూటింగ్ మొదలుపెట్టింది టీమ్. కోస్టల్ ఐలాండ్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నాయ్. సముద్రంలో ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయ్. ఈ సన్నివేశాలను గ్రీన్ స్క్రీన్‌లను ఉపయోగించి స్టూడియోలోనే షూట్ చేయబోతున్నారు.
ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు. సినిమా బడ్జెట్‌లో సెట్లు గ్రాఫిక్స్‌కే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట. గ్రాఫిక్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజువల్ ఎఫెక్ట్స్‌ని హాలీవుడ్ టెక్నీషియన్ హ్యాండిల్ చేస్తున్నాడు. NTR30 మూవీ కూడా ఆర్ఆర్ఆర్‌లాగే.. గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో… ఎఫెక్ట్స్ రిచ్‌గా ఉండేలా ఎన్టీఆర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌కు గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు లభించింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న.. ఈ మూవీ విషయంలో తారక్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.