NTR30: థీమ్‌ సాంగ్‌తో దద్దరిల్లిన అమెరికన్‌ షో

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్‌ 30 గురించి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా అది క్షణాల్లోనే వైరల్‌గా మారిపోతోంది. తారక్‌కు ఇప్పుడున్న క్రేజ్‌ అది. కేవలం ఇండియాలోనే కాదు. ట్రిపులార్‌ సినిమా తరువాత తారక్‌ గ్లోబల్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తారక్‌ ఏ సినిమా చేసినా అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 02:00 PM IST

ఆయన సినిమా నుంచి అప్‌డేట్స్‌ వస్తున్నాయంటే.. వరల్డ్‌ వైడ్‌గా ఉన్న సినిమా ఫ్యాన్స్‌ అంతా ఎదురు చూస్తారు. అలాంటిది ఏకంగా ఎన్టీఆర్‌ 30 థీమ్‌ సాంగ్‌ను ఫ్యాన్స్‌ ముందు ప్లే చేశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌. ఇంకేముంది.. న్యూజెర్సీలో ఫ్యాన్స్‌ కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇదీ.. ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా తారక్‌కు ఉన్న క్రేజ్‌. మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరున్న అనిరుధ్‌ లైవ్‌ బ్యాండ్స్‌ కూడా చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన న్యూజెర్సీలో ఓ ఈవెంట్‌ చేస్తున్నాడు. ఈ ఈవెంట్‌లో తాను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్టీఆర్‌ 30 సినిమాలోని థీమ్‌ సాంగ్‌ మ్యూజిక్‌ ప్లే చేశాడు.

ఈ సాంగ్‌ ఎన్టీఆర్‌ కోసం చేసింది అని చెప్పగానే ఒక్కసారిగా ఫ్యాన్స్‌ కేరింతలు కొట్టారు. ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందంటే.. ఫ్యాన్స్‌ జోష్‌ చూసి అనిరుధ్‌ షాకైపోయాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. ఎన్టీఆర్‌ మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఎన్టీఆర్‌ 30 సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో, గోవాలో భారీ సెట్స్‌ వేశారు.

యాక్షన్‌ సీన్స్‌ ఎక్కువగా ఉండటంతో హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌తో ఫైట్స్‌ కంపోజ్‌ చేయిస్తున్నాడు కొరటాల. తారక్‌ను గతంలో ఎన్నడూ చూడనంత వైల్డ్‌గా ఈ సినిమాలో చూపిస్తానంటూ కొరటాల చెప్పాడు. రీసెంట్‌గా షూటింగ్‌కు బ్లడ్‌ ట్యాంకర్స్‌ తెప్పించి హైప్‌ క్రియేట్‌ చేశాడు. కెన్నీ బేట్స్‌తో ఫైట్‌ సీన్‌ డిస్కస్‌ చేస్తున్న ఫొటోను కూడా రిలీజ్‌ చేశాడు. దీంతో కొరటాల హాలీవుడ్‌ లెవెల్‌లో ప్లాన్‌ చేస్తున్నాడంటూ ఫ్యాన్స్‌ ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు.