ఎన్టీఆర్ నిర్ణయం 30,000 మందిని కాపాడింది.. పాన్ ఇండియా ప్లానింగ్ ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్న వైల్డ్ ఫైర్ వివాదం, ఇప్పట్లో ఆగేలా లేదు. ఇలాంటి టైంలో సడన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సీన్లోకి వచ్చింది. దేవర ఈవెంటే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 01:03 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్న వైల్డ్ ఫైర్ వివాదం, ఇప్పట్లో ఆగేలా లేదు. ఇలాంటి టైంలో సడన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సీన్లోకి వచ్చింది. దేవర ఈవెంటే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అప్పట్లో దేవర టీం ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసి, చివరి క్షణంలో క్యాన్సిల్ చేయటంతో, పెద్ద రచ్చ అయ్యింది. వేలల్లో అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. కట్ చేస్తే చాలా వరకు, ఇదే సందని తారక్ ఫ్యాన్స్ పేరుతో, యాంటీ ఫ్యాన్స్ నెగెటీవ్ కామెంట్స్ కూడా పెట్టారు. కాని ఇప్పుడు ఎన్టీఆర్ నిర్ణయమే తనని, తన ఫ్యాన్స్ ని రెండు సార్లు కాపాడింది. కేవలం ప్రమోషన్ కోసం కక్కుర్తి పడితే, ఆ ఈవెంట్ లోఏదైనా జరగరాంది జరిగితే, దేవర ఎంత పెద్ద హిట్టైనా, ఆ సంతోషం తనకి దక్కేది కాదు. తలలు పట్టుకుని ఉండటం తప్ప తారక్ కూడా ఏం చేయలేని పరిస్తితి ఉండేది. ప్రజెంట్ పుష్ప2 సంధ్యా థియేటర్ వివాదం, బన్నీకి అలానే తయారైంది. ఇలాంటి టైంలో తోటి హీరోలతరో పోలిక పెడుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వైల్డ్ ఫైర్ కూడా కంటిన్యూ అవుతోంది.

పుష్ప2 మూవీ రిలీజైనప్పటి నుంచి వివాదాలే ఎదురయ్యాయి. వసూల్ల లెక్కల మీద కూడా డౌట్లున్నాయంటూ కామెంట్లు వస్తుంటే, 1000 కోట్లు, 1500 కోట్లు, 1600 కోట్లంటూ పోస్టర్లు వస్తున్నాయి. ఇలాంటిటైంలో మల్లూవుడ్ లో పుష్ప2 డిజాస్టర్ అని తేలింది. తెలుగు, తమిల్ రాష్ట్రాల్లలో 70 శాతం వసూళ్లు డ్రాప్ అయితే, కేవలం నార్త్ ఇండియా వసూళ్లే పుష్పని కాపాడుతోందనే మాట వినిపిస్తోంది…

ఇవన్నీ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ తాలూకు ఇష్యూస్ అనుకోవాచ్చు.. కాని సంధ్యా థియేటర్ లో వ్యక్తి మరణం, తర్వాత జరిగిన ఎపిసోడ్… దానికి తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయిన విధానం, ఫైనల్ గా బన్నీని ఫైర్ కాదు ఫ్లవర్ అనితేల్చేశాడంటున్నారు

సినిమాలో డైలాగ్స్ కొట్టినట్టు బయట స్టేట్ మెంట్లిస్తే, ఇలానే ఉంటుందనే మాటల తూటాలే పేలుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పడు సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు రావటం మరో ఎత్తు… సడన్ గా దేవర ప్రస్థావనతో సోషల్ మీడియాలో సీనే మారిపోయింది

దేవర సినిమా రిలీజ్ కి ముందు భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. 5 వేల మంది ఫ్యాన్స్ ని అంచనా వేస్తే, 30 వేల మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈవెంట్ కి అటెండయ్యారు. వాళ్లందరిని కంట్రోల్ చేయటం కష్టమని, ఏకంగా ఈవెంట్ నే క్యాన్సిల్ చేశాడు ఎన్టీఆర్.

అప్పుడైతే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటే లెక్కలేని ఎన్టీఆర్ అంటూ కొన్ని మేమ్స్ వచ్చాయి. నిజానికి ఈవెంట్ క్యాన్సిల్ అవటంతో ఫ్యాన్స్ కొంత వరకు డిసప్పాయింట్ అవ్వొచ్చు, కాని ఇలా స్టేట్మెంట్లు, ట్రోల్స్ మాత్రం చేసినట్టు ఎక్కడా ప్రూవ్స్ లేవు. అంతా యాంటీ ఫ్యాన్సే సందు దొరికిందని చేసిన పైశాచిక ప్రయత్నం ఇదన్నారు..

సరే ఆ సంగతి ఎలా ఉన్నా, సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ తర్వాత పుష్ప2 టీం ఎంతగా తలలుపట్టుకుందోచూస్తే, దేవర ఈవెంట్ క్యాన్సిల్ చేసి గతంలో ఎన్టీఆర్ ఎంత గొప్ప పనిచేశాడనే మాటలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలే ఎన్టీఆర్ ఊర మాస్ ఇమేజ్ కి భారీ ఫాలోయింగ్ ఎక్కువ… అలాంటప్పుడు ఒకవేళ దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయకపోతే, 30 వేల మందిలో ఎందరి పరిస్థితి ఎలా ఉండేదో అన్న డౌట్లు పెరిగాయి. గతంలో ఓసారి ఆంధ్రా వాల ఈవెంట్ కి లక్షల్లో జనం వస్తే, వాళ్లందరు జాగ్రత్తగా ఇంటికెళ్లేలా ఎన్టీఆర్ అండ్ టీం జాగ్రత్తలు తీసుకుంది… సో అప్పటి ఇన్స్ డెంట్, మొన్నటి దేవర ఈవెంట్ క్యాన్సిల్ ఈరెండు విషయాల్లో ఎన్టీఆర్ కి చాలా లేటుగా కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి.