PAWAN KALYAN: ఫ్యాన్స్‌కి పండగే పండగ.. ఇక వారానికో సర్‌ప్రైజ్ రెడీ..!

సలార్ ట్రైలర్‌ని సెప్టెంబర్ 14కి, పాటని మాత్రం ఈనెలాఖరుకి రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇలా ప్రభాస్‌ మూవీతోపాటు పవన్ ఓజీ అప్‌డేట్స్‌తో ఇద్దరి ఫ్యాన్స్‌కి పండగ కన్ఫామ్ అయ్యింది. ఐతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా శంకర్ నిర్ణయం తీసుకున్నాడు.

  • Written By:
  • Updated On - August 24, 2023 / 07:13 PM IST

PAWAN KALYAN: పవన్ సినిమా ఓజీ గ్లింప్స్ సెప్టెంబర్ 1కి రాబోతుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగొచ్చినట్టే అంటున్నారు. ఇలాంటి టైంలో సలార్ టీం సర్‌ప్రైజ్ అంటోంది. ఈ చిత్రంలోని సాంగ్‌ని ఈనెల 30న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సలార్ ట్రైలర్‌ని సెప్టెంబర్ 14కి, పాటని మాత్రం ఈనెలాఖరుకి రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇలా ప్రభాస్‌ మూవీతోపాటు పవన్ ఓజీ అప్‌డేట్స్‌తో ఇద్దరి ఫ్యాన్స్‌కి పండగ కన్ఫామ్ అయ్యింది.

ఐతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా శంకర్ నిర్ణయం తీసుకున్నాడు. దసరాకు ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసేందుకు రంగం సిద్దం చేశాడు. దిల్ రాజు అండ్ టీం ఈ విషయాన్ని వినాయక చవితికి ఎనౌన్స్ చేయబోతోందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 తాలూకు కొత్త ప్రోమో దసరాకు రాబోతోంది. ఆల్రెడీ అక్టోబర్ 23న కొత్త ప్రోమోకి ముహుర్తం కుదిరింది. ఇక సెప్టెంబర్ 15కి రానున్న ఉస్తాద్ రామ్ మూవీ స్కంద తాలూకు ట్రైలర్ ఈ శనివారం రిలీజ్ కానుంది. అదే రోజు జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ని రివీల్ చేయనుంది ఫిల్మ్ టీం.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి కూడా గుంటూరు కారం సాంగ్‌తో ఫిల్మ్ టీం సర్ ప్రైజ్ రెడీ చేసింది. భగవంత్ కేసరి సాంగ్ ఈ నెల 30న రానుంది. ఇవన్నీ ఫిక్స్ అయిన డేట్లు. ఈనెల, వచ్చేనెలలో రానున్న బడా హీరోల సినిమా అప్ డేట్లు.