బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కాంతారా, ట్రిపులార్, దసరా.. ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డ్స్ తిరగరాసిన అన్ని సినిమాలు 80, 90 లలో జరిగినవే. సౌత్ హీరోల సినిమాలు ఇక్కడ హిట్ అవుతున్నాయంటే హీరో చరిష్మా అనకోవచ్చు. కానీ నార్త్‌లో కూడా మని సినిమాలు ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయంటే ఖచ్చితంగా కథలో మ్యాటర్ ఉన్నట్టే. దీన్ని బట్టి చూస్తే పాతరోజుల్లో సౌత్‌లో జరిగిన కథలు నార్త్ పీపుల్‌ను ఓ రేంజ్‌లో ఎట్రాక్ట్ చేస్తున్నాయని క్లియర్‌గా అర్థమౌతోంది.
నిఖిల్ హీరోగా వచ్చిన కార్తీకేయ సినిమా ఈ టైం స్టోరీనే అయినా.. కథను కృష్ణుడికి కనెక్ట్ చేయడంతో ఆ సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా నార్త్ మనసు గెలుచుకున్న సినిమాలు అన్నీ రెట్రో సినిమాలే కావడం ఇంట్రస్టింగ్ పాయింట్. కలెక్షన్స్ విషయంలో కూడా ఒక సినిమా ఇంకో సినిమా రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెళ్తోంది. దీంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇలాంటి కథలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. కథ పాతదైతో కోట్లు కురిపించేస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో ఇదే సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది.