Balagam: మంచి కంటెంట్, ఏమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా పండించే యాక్టర్స్.. ఈ రెండూ ఉంటే చాలు. ఆ సినిమాను ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ చేస్తారు. ఇదే విషయాన్ని సింపుల్‌గా ప్రూవ్ చేశాడు డైరెక్టర్ వేణు. బలగం సినిమాతో చిన్న సినిమాల దమ్మేంటో చూపించాడు. మనిషి చనిపోయిన తరువాత పిండాన్ని పిట్ట ముడితే చనిపోయినవారి ఆత్మకు శాంతి కలుగుతుందని తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నమ్ముతుంటారు. పిండాన్ని పిట్ట ముట్టకపోతే ఊర్లో ఆ ఫ్యామిలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి.
వినడానికి సింపుల్‌గానే ఉన్నా.. ఇందులో చాలా డీప్ ఎమోషన్స్ మిళితమై ఉంటాయి. ఇదే స్టోరీ లైన్‌తో సినిమా తీసి ప్రతీ ఒక్కరి హార్ట్ టచ్ చేశాడు వేణు. అటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. అందుకే ఈ చిత్రానికి అనేక అవార్డులు దక్కుతున్నాయి. ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న బలగం సినిమా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. అది కూడా అనేక హాలీవుడ్ మూవీ డైరెక్టర్స్‌ను బీట్ చేసి మరీ ఈ చిత్రానికి అవార్డు దక్కడం విశేషం. ఆమ్‌స్టర్‌డామ్‌లో నిర్వహించిన అరౌండ్ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్‌లో.. బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో వేణుకు అవార్డ్ ఎనౌన్స్ చేశారు. అమెరికా, చైనా, లండన్ లాంటి దేశాల నుంచి సినిమాలు, డైరెక్టర్లు ఈ అవార్డు కోసం పోటీలో ఉన్నారు.
కానీ వాళ్లందరినీ బీట్ చేసి వేణు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇవే కాకుండా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఒనికో ఫిల్మ్స్ వంటి అవార్డ్స్ సొంతం చేసుకుంది బలగం సినిమా. రీసెంట్‌గా వచ్చిన అవార్డ్‌తో కలిపి మొత్తం 9 అవార్డ్స్ బలగం ఖాతాలో చేరాయి. తెలంగాణ కల్చర్‌ను, ట్రెడిషన్‌ను నేచురల్‌గా ప్రజెంట్ చేయడంలో వేణు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజైన బలగం సినిమా.. థియేటర్స్‌లో ఆడియన్స్‌కు ఓ రేంజ్‌లో కనెక్ట్ అయింది. సినిమాలోని చాలా సీన్స్ మన జీవితంలో ఎక్కడో ఒక స్టేజ్‌లో ఫేస్ చేసినట్టుగానే అనిసిస్తుంది.
ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ సాంగ్.. ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టించింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు.. యూత్ కూడా థియేటర్స్‌కు క్యూ కట్టారు. చాలా విలేజెస్‌లో ఈ సినిమాను స్పెషల్ షోలు వేసి చూపిస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.