Miss Shetty Mr Polishetty: సినిమాలు పెరిగాయి.. కలెక్షన్స్ తగ్గాయి..

సెప్టెంబర్‌లో సక్సెస్‌ పర్సెంటేజ్‌ తక్కువే అయినా.. చివరివారంలో వచ్చిన మూడు సినిమాలు ఆదుకుంటాయనుకుంటే.. చేతులెల్తేశాయి. దీంతో సెప్టెంబర్‌లో వచ్చిన తెలుగు, డబ్బింగ్‌ మూవీస్‌ అన్నీ కలిపితే రెండు సినిమాలే లాభాలు తీసుకొచ్చాయి.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 07:55 PM IST

Miss Shetty Mr Polishetty: వారానికి మూడు నాలుగు సినిమాలు.. నెలకు దాదాపు 20 సినిమాలు వస్తున్నా.. తెలుగులో సక్సెస్‌ రేటు మాత్రం పెరగడం లేదు. నెలకు ఒకటీ అర సినిమాలే సక్సెస్‌ అవ్వాలన్న రూల్‌ను సెప్టెంబర్‌ కూడా కంటిన్యూ చేసింది. సెప్టెంబర్‌లో లాభాలు తీసుకొచ్చిన స్ట్రైట్‌ మూవీ ఒక్కటే. సెప్టెంబర్‌ నెల ఖుషీ రిలీజ్‌తో మొదలైంది. ఆడియో హిట్‌తో సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీకెండ్‌ మూడు రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయడంతో.. 10 రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

అయితే.. సోమవారం నుంచి కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోవడంతో థియేట్రికల్‌ రైట్స్‌ రాబట్టలేకపోయింది. పాన్‌ ఇండియాగా రిలీజైన ఖుషీని రూ.53 కోట్లకు అమ్మితే.. రూ.40 కోట్లు మాత్రమే రాబట్టింది. బ్రేక్‌ ఈవెన్‌కు 13 కోట్ల తేడాతో వెనుకపడిపోయింది. ఆడియో హిట్టయినా.. పాత కథకే కాశ్మీర్‌ అందాలు అద్ది ఫ్రెష్‌ కోటింగ్‌ ఇచ్చినా.. ఆడియన్స్‌ మాత్రం తెలిసిన కథే అంటూ లైట్‌గా తీసుకున్నారు. సెప్టెంబర్‌లో సక్సెస్‌ పర్సెంటేజ్‌ తక్కువే అయినా.. చివరివారంలో వచ్చిన మూడు సినిమాలు ఆదుకుంటాయనుకుంటే.. చేతులెల్తేశాయి. దీంతో సెప్టెంబర్‌లో వచ్చిన తెలుగు, డబ్బింగ్‌ మూవీస్‌ అన్నీ కలిపితే రెండు సినిమాలే లాభాలు తీసుకొచ్చాయి. అఖండ హిట్‌ తర్వాత బోయపాటి శ్రీను నుంచి వచ్చిన స్కందపై రామ్‌ ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. హైప్‌కు తగ్గట్టే.. రామ్‌ మార్కెట్‌ కంటే ఎక్కువగా.. రూ.47 కోట్లకు బిజినెస్‌ జరిగితే.. ఇంకా రూ.17 కోట్లు రాబట్టాల్సి వుంది. ఒకేరోజు వచ్చిన మూడు సినిమాలూ నిరాశనే మిగిల్చాయి. 28న రిలీజైన స్కంద.. చంద్రముఖి2.. పెద్దకాపు 1 వీకెండ్‌లోనూ వసూళ్లను తీసుకురాలేదు. ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్‌ను ప్రకటించినా… వీటి రిజల్ట్‌ చూస్తుంటే.. సీక్వెల్స్‌ ప్రస్తావన వుండే ఛాన్స్‌ లేదు. షారూక్‌ జవాన్‌ సెప్టెంబర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచింది.

పఠాన్‌ హిట్‌తో జవాన్‌ తెలుగు రైట్స్‌ ఫ్యాన్సీ రేటు రూ.18కోట్లకు అమ్ముడైతే.. రూ.30 కోట్లు తీసుకొచ్చింది. తమిళ డైరెక్టర్‌ అట్లీ తీసిన.. నయనతార, విజయ్‌ సేతుపతి నటించినా.. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషం. జవాన్‌ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడటం అంత ఈజీ కాదు. ఈ ఫీట్‌ను చిన్న సినిమా ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ అందుకుంది. అనుష్క, నవీన్‌ పోలిశెట్టి నటించిన ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా, మౌత్‌ టాక్‌తో ముఖ్యంగా ఓవర్సీస్‌లో మిలియన్‌ మార్క్‌ దాటి హిట్‌ అనిపించుకుంది. మిస్‌ శెట్టి రూ.13 కోట్లకు బిజినెస్‌ జరిగితే.. రూ.22 కోట్లు కలెక్ట్ చేసింది. జవాన్‌ గాలిలో కొట్టుకుపోతుందనుకున్న ఈ చిన్న చిత్రానికి ఇది పెద్ద విజయమే.