డిస్ట్రిబ్యూటర్లను కాపాడింది ఇద్దరే ఇద్దరూ… రెబల్ మాస్ జాతర…

థియేటర్స్ కి జనం క్యూ కట్టే రోజులు పోయాయి... మీడియం రేంజ్ హీరోలు, చిన్న సినిమాలకు ఓటీటీనే దిక్కవుతుంది. ఇలాంటి టైంలో సీన్ లోకి వచ్చిన ఇద్దరే ఇద్దరు హీరోలు డిస్ట్రిబ్యూటర్లను కాపాడారు. కాపాడుతున్నారు కూడా... మూతపడ్డ సింగిల్ స్క్రీన్ థియేటర్లను గట్టెక్కించారు.

  • Written By:
  • Publish Date - October 16, 2024 / 12:52 PM IST

థియేటర్స్ కి జనం క్యూ కట్టే రోజులు పోయాయి… మీడియం రేంజ్ హీరోలు, చిన్న సినిమాలకు ఓటీటీనే దిక్కవుతుంది. ఇలాంటి టైంలో సీన్ లోకి వచ్చిన ఇద్దరే ఇద్దరు హీరోలు డిస్ట్రిబ్యూటర్లను కాపాడారు. కాపాడుతున్నారు కూడా… మూతపడ్డ సింగిల్ స్క్రీన్ థియేటర్లను గట్టెక్కించారు. విచిత్రం ఏంటంటే బాలీవుడ్ హీరోల వల్ల కూడా కాని పని రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్లైంది. ఎక్కడో రాజస్థాన్ లోమూతపడ్డ రెండు థియేటర్లని కాపాడింది రెండు తెలుగు సినిమాలు… లక్నోలోని మూడు థియేటర్లనే కాదు, ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లను కాపాడింది ప్రభాస్,ఎన్టీఆర్ లే… ఖాన్లు, కపూర్లు చేయలేని పని మన పాన్ ఇండియా స్టార్లు చేస్తున్నారు. కల్కీ రేంజ్ లోనే దేవర దూకుడు, నార్త్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్ల ఫేట్ మార్చిందా…? అదెలానో చూసేయండి.

దేవర, కల్కీ ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రాకపోయుంటే… ఈ ప్రశ్నే డిస్ట్రి బ్యూటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్ల ఒంట్లో వనుకు తెప్పించేది… ఆల్రెడీ ఈ రెండు సినిమాలొచ్చాయి, వసూళ్ల వరద తెచ్చాయి. కాబట్టి రాకపోయుంటే అనే ప్రశ్నే అర్ధం లేంది. కాని ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్న వేయాల్సిందే.. ఎందుకంటే, రాజస్టాన్, ఉత్తర ప్రదేశ్ లోని మారూమూల ప్రాంతాల్లో కొన్ని థియేటర్స్ ని , నార్త్ ఇండియా డిస్ట్రి బ్యూటర్లని ఈ ఏడాది కాపాడింది కల్కీ, దేవర సినిమాలే..

ఇవి రాకపోయుంటే నార్త్ ఇండియా మార్కెట్ కుప్పకూలటమే కాదు, డిస్ట్రిబ్యూటర్లతో సహా చాలా థియేటర్స్ మూతపడే పరిస్థితి… అసలు కల్కీ రిలీజ్ కిముందు సౌత్ లో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని తాత్కాలికంగా మూసేశారు. అంతో ఇంతో సక్సెస్ రేటున్న తెలుగు సినిమాలు, అందులో 100 శాతం సక్సెస్ రేటున్న తెలుగు పాన్ ఇండియా మూవీలు వచ్చే ఇండస్ట్రీలోనే పరిస్థితి ఇలా ఉంటే, హిందీ మార్కెట్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు

ఎందుకంటే పదేళ్లుగా బాలీవుడ్ సక్సెస్ రేటు ఒకటి, రెండు మధ్య కొట్టుకుంటోంది. ఏడాదికో హిట్ పడటమే అక్కడ గగనం. ఏదో షారుఖ్, పటాన్, జావన్ వదిలేస్తే, అక్కడ వందలకోట్ల వసూళ్లు తెచ్చేసినిమాలు అరుదు…

ఇక మీడియం రేంజ్ మూవీలు, ఖాన్లూ, కపూర్లు చేసే ప్రయోగాలు డిజాస్టర్లవుతున్నాయి. అందుకే ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రా, రాజాస్టాన్ లో చాలా థియేటర్స్ పర్మినెంట్ గా మూతపడితే కల్కీ, దేవర మూవీలు వాటిని తెరిపించాయనే వార్త లేటుగా వైరలౌతోంది

నిజంగానే రాజస్థాన్ లో జమానా తాలూకు చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రమే కాదు, నార్త్ ఇండియాలో చాలా మంది హిందీ మూవీల మీద పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు రోడ్లమీదకొచ్చే పరిస్థితి. కారణం క్వాలీటీ లేని హిందీ సినిమాలు, వాటికోసం వందలు, వేలు ఖర్చెందుకని థియేటర్స్ కి దూరమైన హిందీ జనం… అందుకే నార్త్ ఇండియాలో థియేటర్స్ బిజినెస్ లాస్ లోనడుస్తోంది.

అలాంటితి అతి తక్కువ రేటుకి కల్కీ, దేవర తాలూకు వాళ్ల ఏరియా రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కనకవర్షం రావటంతో, చాలా వరకు అప్పులు తీర్చే పరిస్థితొచ్చిందంటున్నారు. మహారాష్ట్రాలో 3 జిల్లాలో 9 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి దేవర వసూళ్లు ప్రాణం పోశాయి. వాటి ఓనరే డిస్ట్రిబ్యూటరవ్వటంతో, తనుకూడా గత హిందీ సినిమాల ఫెల్యూర్స్ తో పోగొట్టుకుంది దేవరహిట్ తో రాబట్టుకున్నాడట.

అంతెందుకు పుష్ప లాంటి మూవీ వెస్ట్ బెంగాలోని ఓ మారుమూల ప్రాంతంలో థియేటర్స్ ని హౌైజ్ పుల్ చేసిందంటే, అది తెలుగు పాన్ ఇండియా మూవీల ఘనతే..మొత్తానికి బాలీవుడ్ లో ఖాన్లూ, కపూర్లు హిట్ మెట్టెక్కడంలో చేతులెత్తేశారు. ఇప్పడు వాళ్లకి పోటీగా కాదు, అసలు వాళ్ల వల్ల కాని పనులు కూడా తెలుగు స్టార్లు చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ ఏడాది కల్కీ, దేవర హిట్లతో సౌత్ లోని థియేటర్స్ ని, డిస్ట్రిబ్యూటర్లనే కాదు, నార్త్ ఇండియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని కాపాడారు. మూతపడే థియేటర్స్ ని తెరిపించగలిగారు.