Operation Valentine Review: ఆపరేష్ వాలెంటైన్ మూవీ రివ్యూ.. వరుణ్ తేజ్‌కు హిట్ దక్కినట్లేనా..?

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కథ గురించి చెప్పాలంటే మన మీద పాక్ చేసిన పుల్వామా దాడి, అందుకు ప్రతిగా ఇండియా చేసిన బాలా కోట్ దాడులు.. ఈ రియల్ ఇన్స్ డెంట్స్ నే కథాంశంగా తీసుకుని, ఆపరేషన్ వాలెంటైన్, ఆపరేషన్ వజ్ర కాన్సెప్ట్ ని డిజైన్ చేశాడు డైరెక్టర్.

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 06:14 PM IST

Operation Valentine Review: ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కి ముందే ప్రోమోలతో దుమ్ముదులిపింది. ఫైటర్ మూవీతో పోల్చటం వల్ల తెలుగు సినిమాకు హిందీలో కూడా మార్కెట్ క్రియేట్ అయ్యింది. అంతా బాగుంది. ఎటుచూసినా అన్నీ మంచి శకునాలే అనుకోవచ్చు.. మరి సినిమా బాగుందా అంటే.. అక్కటే అసలైన పరేషన్ మొదౌతోంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కథ గురించి చెప్పాలంటే మన మీద పాక్ చేసిన పుల్వామా దాడి, అందుకు ప్రతిగా ఇండియా చేసిన బాలా కోట్ దాడులు.. ఈ రియల్ ఇన్స్ డెంట్స్ నే కథాంశంగా తీసుకుని, ఆపరేషన్ వాలెంటైన్, ఆపరేషన్ వజ్ర కాన్సెప్ట్ ని డిజైన్ చేశాడు డైరెక్టర్.

SSMB 29: నీకెంత..? నాకెంత..? లెక్కలు వేసుకుంటున్నారు..

ఇంతకి మనోళ్ళ దాడి ఎలా ఉంది, వాళ్ల ప్రతిదాడి తర్వాత మన నుంచి వచ్చిన మరో కౌంటర్ ఎటాక్ ఇలా సాగే వార్ ఎపిగ్ గా వచ్చింది ఆపరేషన్ వాలెంటైన్. ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో ఫైటర్ పైలట్ పాత్రలో వరుణ్ తేజ్ పాతుకుపోయాడు. మాజీ మిస్ యూనివర్స్ కూడా రాడార్ ఆపరేటర్ గా పాత్రకు సూటైంది. కాని ఇద్దరి మధ్య ప్రేమ, అలానే కెమిస్ట్రి సెట్ అవలేదంటున్నారు. ఏదో బలవంతంగా రొమాంటిక్ సీన్లు రాశారన్నట్టు ఆ సీక్వెన్స్ పండలేదు. ఇక ఆపరేషన్ వాలెంటైన్ అసలు కథ సెకండ్ హాఫ్ లోనే మొదలౌతుంది. అంతవరకు ఫిల్మ్ టీం టైం పాస్ చేశారా అన్నట్టు సాగతీతగా సీన్లు ఉండటం డిసప్పాయింట్ చేస్తుంది. కాని ఇంటర్వెల్ బ్యాంగ్, అలానే సెకండ్ హాఫ్ లో ఫైటర్ జెట్ ఫైట్ సీన్లు అదిరిపోయాయి.

కాకపోతే ఎవుర ఎంతుకు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తున్నారో అర్ధం కాక అదో కలగూర గంపలా సీన్ల నెరేషన్ జరిగింది. మ్యూజిక్ పర్లేదు, సినిమాటోగ్రఫి, విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. డైరెక్షన్ కూడా పర్లేదని అంటూనే నెరేషన్ లో కన్ ఫ్యూజన్ ఎక్కువుందనే కామెంట్స్ పెరిగాయి. ఓవరాల్ గా హిందీ మూవీ ఫైటర్ తో పోలిస్తే ఆపరేషన్ వాలెంటైన్ బెటర్ కాని, దీని వరకే చూస్తే ట్రైలర్ పేలినంత గొప్పగా సినిమా దూసుకెళ్లట్లేదు. ఆపరేషన్ వాలెంటైన్ లో నెరేషన్ పరేషన్ మాత్రం మైనెస్ గా మారింది.