2000 వేల కోట్లా..? ఎన్టీఆర్ పాటలకు 25 కోట్లు..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. ఆల్రెడీ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా తను సైన్ చేసినట్టున్నాడు.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 05:16 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. ఆల్రెడీ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా తను సైన్ చేసినట్టున్నాడు. ఇలాంటి టైంలో ఎ ఆర్ రెహ్మాన్ తన భార్యతో విడిపోతోందన్న వార్త వచ్చింది. కాని ఆ న్యూస్ వచ్చిన మరుసటి రోజే 2 వేల కోట్ల మ్యాటర్ షాక్ ఇస్తోంది. ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ రెహమాన్ అని అంతా షాక్ అయ్యేలా ఆ వార్త , సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదే కాదు ఫస్ట్ టైం ఏ ఆర్ రెహమాన్ రెమ్యునరేషన్ విషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ వార్తల్లోకి ఎక్కేలా ఉంది.. అదెలానో చూసేయండి.

ఎ ఆర్ రెహమాన్ తన వైఫ్ తో విడాకులు తీసుకున్నాడు. ఆతర్వాతే రెండు విషయాలు షాక్ ఇచ్చాయి. ఒకటి రెహమాన్ ఆస్తుల వివరాలు. రెండు రామ్ చరణ్ మూవీతోపాటు ఎన్టీఆర్ సినిమాకు కూడా ఈ ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ కంపెజ్ చేయబోతున్నాడని తేలింది. అది కూడా ఇంతవరకు తను ఎన్నడూ అందుకోనంత భారీ పారితోషికంతో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు

29ఏళ్ల వివాహ బందానికి దూరం అవుతున్నట్టు ఏఆర్ రెహమాన్ ఎనౌన్స్ చేయగానే తన అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. దీనంతటికీ కారణం రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ లు, ప్రొఫేషన్ తో బిజీ అవటం, తన వైఫ్ ఒంటరి తనం ఫీల్ అవటంతో పాటు లైఫ్ బోరింగ్ గా మారటమే అంటూ ప్రచారం ఊపందుకుంది. కారణం ఏదైనా రెహమాన్ తన వైఫ్ ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. ఎనౌన్స్ చేశారు

దీంతో ఇప్పుడు రెహమాన్ మొత్తం ఆస్తులు వివరాలు బయటికొచ్చాయి. వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవాలనుకుంటే, పిల్లలకు ఆస్తుల పంపకాలు, అలానే భార్యకి దక్కాల్సిన భరనం. ఇవన్నీ లెక్కలు తేలాలంటే తన ఆస్తి వివరాలు లెక్కకట్టాలి.

అలా లెక్కేస్తే 1700 కోట్ల నుంచి 2000 కోట్ల విలువైన ఆస్తులు, రెహామాన్ సొంతమని తెలుస్తోంది. అంతేకాదు తను ఒక సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే, 8 నుంచి 10 కోట్లు తీసుకునేతను, కేవలం ఒక పాట పాడేందుకు మూడు కోట్లు తీసుకుంటాడనే విషయం రివీల్ అయ్యింది. ఇక బ్యాంక్ బ్యాలన్స్, స్తిర చర ఆస్తుల మొత్తం విలువ 2 వేల కోట్ల లోపు ఉండటంతో, ఇండియాలో నెంబర్ వన్ రిచ్చెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు రెహమాన్

అంతేకాదు తను బుచ్చి బాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న పెద్ది మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి 20 కోట్లు తీసుకుంటున్న, రెహమాన్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీకి పాతికకోట్లు చార్చ్ చేయబోతున్నాడట. కేజీయఫ్, సలార్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన రవి బస్రూర్ ని కాదని ఎన్టీఆర్ డ్రాగన్ కి రెహమాన్ ని ఫిక్స్ చేశారట. అందుకే ఈ ఆస్కార్ విన్నర్ 25 కోట్లు చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.