Oscar 2024: లాస్ ఏంజెల్సలోని డాల్బీ థియేటర్‌లో 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎంతో హుషారుగా సాగింది. ఈ ఏడాది డాక్యుమెంటరీ విభాగంలో మన భారతీయ ఫీచర్ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’ నామినేట్ అయ్యింది. అయితే ఇది ఈ సారి అవార్డును సాధించలేకపోయింది. గతేడాది ఆర్‌ఆర్‌ఆర్‌తో మూడు విభాగాల్లో భారత్ ఆస్కార్ అవార్డుల్ని దక్కించుకున్నారు. అయితే ఈ సారి మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది.
Vishwambhara: విజువల్ ట్రీట్.. విశ్వంభరలో త్రిష మరో శ్రీదేవిలా కనిపించనుందా..?
డాక్యుమెంటరీ విభాగంలో ఈ సారి అమెరికన్ హాలీవుడ్ డాక్యుమెంటరీ ‘20 డేస్ ఇన్ మారియుపోల్’ అవార్డు దక్కించుకుంది. భారతీయ డాక్యుమెంటరీ అయిన టు కిల్ ఏ టైగర్ ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలూ అందుకుంది. అందుకనే ఈ ఏడాది ఈ ఫీచర్ ఫిల్మ్‌ని ఆస్కార్ వరిస్తుందని భారతీయులు అంతా ఆతృతగా ఎదురు చూశారు. కానీ అది ఇప్పుడు నిరాశ పరిచింది. అయితే గతేడాది మన దేశం నుంచి ఇదే కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. అయితే 2024లో ఈ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న 20 డేస్ ఇన్ మారియుపోల్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది.
రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత మారియుపోల్ అనే ఓడరేవును సీజ్ చేశారు. ఆ సమయంలో ఉక్రెయిన్ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను అందులో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దీంతో ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ఈ ఫీచర్ ఫిల్మ్‌కి దక్కింది.