Oskar Effect: తమ్మారెడ్డి వ్యాఖ్యలపై ప్రముఖుల స్పందన

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఎలాంటి మాటల యుద్దాలు జరగడం లేదు. కానీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో అలజడి సృష్టించారు తమ్మారెడ్డి భరద్వాజ్. తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రాలనికి సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 10, 2023 / 02:25 PM IST

తెలుగు సినిమా అంటే ఒకప్పుడు మన రెండు రాష్ట్రాల్లోనే ఆడే పరిస్థితి ఉండేది. ఇది గత దశాబ్ధాలమాట. కానీ ప్రస్తుత స్థితి మారిపోయింది. మన చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలై పాన్ ఇండియా చిత్రంగా దేశవ్యాప్తంగా హిట్ టాక్ నమోదు చేసుకుంటున్నాయి. ఇక గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే పొరుగు రాష్ట్రాల అగ్రకథానాయకులు కూడా తెలుగు సినిమాల్లో నటిస్తూ వారి వారి భాషల్లో అనువాదంతో తెరకెక్కుతున్నాయి. ఇలాంటి తరుణంలో మగధీర సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆతరువాత ఈగ సినిమాతో గ్రాఫిక్స్ కి పూర్తిస్థాయి ప్రాధాన్యత ఇచ్చి తనదైన ముద్రను వేసుకున్నారు. అలాగే బాహుబలి, బాహుబలి 2 తో ప్రపంచానికి తన దర్శకత్వ ప్రతిభను చూపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకునే స్థాయికి ఆయన చిత్రం ఉందంటే ఇది తెలుగువాడి గొప్పతనంగా చెప్పుకోవాలి.

ఇప్పటి వరకూ తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డు ఎక్కడా లభించలేదు. దీనికోసం ప్రపంచ దేశాలన్నీ వెయ్యి కన్నులతో ఎదురుచూస్తాయి. అలాంటి గుర్తింపు నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కంపోజింగ్ క్యాటగిరీలో రావడం అంటే సాహిత్యానికి, సంగీతానికి, దర్శకత్వానికి వచ్చిన గుర్తింపుగా భావించాలి. అంతేకాకుండా ఆపాటను డిజైన్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ యొక్క చెమట కష్టం ఉందని చెప్పాలి. ఇలా ప్రపంచదేశాలు గుర్తించడమే కాకుండా జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి అగ్రదర్శకులు ప్రశంశల జల్లుగుప్పించారు.

ఇక ప్రస్తుతం ఈ టీం అమెరికాలో సందడి చేస్తుంది. తాజాగా ఈ అవార్డుపై తెలుగు సినిమా నిర్మతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. ఆస్కార్ కోసం 80కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ 80 కోట్లు ఉంటే పది సినిమాలు తీసి వారి మొఖాన కొడతామంటూ తీవ్రంగా విమర్శించారు. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురినుంచి ఘాటుగా ప్రతివిమర్శలు, ప్రశ్నలు సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్నాయి.

మెగా బ్రదర్ నాగబాబు తన ట్విట్టర్ వేదికగా నీ అమ్మా మొగుడు ఇచ్చాడా అంటూ వైసీసీ భాషలో స్పందించినట్లు చెపుకొచ్చారు. ఇప్పుడు దీనిపై దర్శకేంద్రుడు కె. రా‎ఘవేంద్ర రావు కూడా స్పందిస్తూ అలా ఖర్చు చేసినట్లు నీదగ్గర అకౌంట్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాగే అగ్ర దర్శకులు, నిర్మాతలు డబ్బులు తీసుకొని మన తెలుగు సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నాట్లు నీ ఉద్దేశమా అంటూ ట్వీట్ చేశారు. దీనిపై తమ్మారెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

భరద్వాజ్ వ్యాఖ్యలపై ఇంకా ఎంతమంది నుంచి కామెంట్లు వస్తాయో చూడాలి. వాటన్నింటికీ సమాధానాలు చెబుతారా.. లేక దాటవేసి కామ్ గా ఉండిపోతారా.. లేక అలాంటి వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటారా అనేది కాలం నిర్ణయిస్తుంది.

 

 

T.V.SRIKAR