Jr NTR: ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరడం వెనక ఎన్నో కష్టాలు.. తారక్ జీవితంలో మరో కోణం ఇదే..!

వరుసగా సినిమాలు ఫ్లాపైన సమయంలో... ఎన్టీఆర్ పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీయాలని.. తన సినిమా చూసి అభిమానులు కాలర్‌ ఎగరేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తాడు. ఆ గుణమే ఆయనను గ్లోబల్‌స్టార్‌గా నిలిపింది.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 12:30 PM IST

ఎన్టీఆర్.. ఇదేదో మూడు పదాలు కాదు.. మాస్ జనాలకు యుఫేరియా ఒకరకంగా ! సినిమా ప్రేమికులకు ఓ జపం.. ఎన్టీఆర్ అభిమానులు అనుకునేది ఇదే ! ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్‌తో ఎన్టీఆర్‌ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇదేదో ఒక్క రోజులో.. ఓవర్‌నైట్‌లో వచ్చిన సక్సెస్ కాదు. పడిన కష్టాలు.. దిగిన మెట్లు అన్నీ ఇన్నీ కావు. సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకోవడం కంటే.. దాన్ని నిలబెట్టుకోవడమే అసలు మ్యాటర్. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ మాతర్ం.. ఆ స్టేటస్ నిలబెట్టుకుంటూ.. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. తారక్‌కు ఈ రేంజ్ దక్కడం వెనక ఉన్న కష్టం అంతా ఇంతా కాదు.

బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఎన్టీఆర్.. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. వీఆర్ ప్రతాప్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ సినిమా… డిజాస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా సపోర్టు లేని సమయం అది. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉంటారా లేదా అనే అనుమానాలు వినిపించిన సమయంలో.. స్టూడెంట్‌ నంబర్ వన్‌ తారక్‌ను నిలబెట్టింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ వెనక కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయ్. సింహాద్రి ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా.. ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు తారక్‌ను ఇబ్బంది పెట్టాయ్. అలాంటి సమయంలో రాఖీ మూవీ కోసం ఏకంగా 30కేజీల బరువు తగ్గి ఎన్టీఆర్ ఔరా అనిపించాడు. పొలిటికల్ ఫ్యామిలీ కూడా కావడంతో.. తారక్‌కు ఎదురైన సవాళ్లు, అనుభవాలు ఎన్నో ! బంధువుల నుంచి, పొలిటికల్‌గా విమర్శలు వచ్చినా.. తారక్ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు.

వరుసగా సినిమాలు ఫ్లాపైన సమయంలో… ఎన్టీఆర్ పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీయాలని.. తన సినిమా చూసి అభిమానులు కాలర్‌ ఎగరేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తాడు. ఆ గుణమే ఆయనను గ్లోబల్‌స్టార్‌గా నిలిపింది. యాక్టింగ్‌, డ్యాన్స్‌లో ఎన్టీఆర్ టాలెంట్ చెప్పాల్సిన పని లేదు. కనుబొమ్మలతోనూ యాక్టింగ్‌ చేయగలడు అని ప్రతీసారి చెప్తుంటాడు రాజమౌళి ! ఆర్ఆర్ఆర్ ఇచ్చిన కిక్‌తో.. ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమాలు కూడా మిగతా భాషల్లో సత్తా చాటడం ఖాయమని తేలిపోయింది. నటుడిగా ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన అవకాశాలను సొంతం చేసుకోవడంతో పాటు ఊహించని స్థాయికి ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.