PALLAVI PRASANTH: పల్లవి ప్రశాంత్‌కు గుడ్‌న్యూస్‌.. కోర్టు తాజా ఆదేశాలేంటంటే..

తనకు, తన సోదరుడికి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పల్లవి ప్రశాంత్. నాంపల్లి కోర్టు బెయిల్‌లో ఇచ్చిన కండిషన్ రెండు నెలలు పూర్తి అయిందని పిటిషన్‌లో తెలిపాడు.

  • Written By:
  • Publish Date - February 21, 2024 / 07:54 PM IST

PALLAVI PRASANTH: రైతు బిడ్డను.. రైతు కష్టాన్ని ప్రపంచానికి చూపిస్తా.. తండ్రి కళ్లల్లో ఆనందం చూస్తానని బిగ్‌బాస్‌ సీజన్‌ 7లోకి ఎంటర్ అయి విజేతగా నిలిచిన ప్రశాంత్‌ వ్యవహారంలో.. కనిపించిన ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. విజేతగా నిలిచిన ఆనందం.. 24 గంటలు కూడా లేకుండా పోయింది అతడికి. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో.. పల్లవి ప్రశాంత్‌ మీద కేసు నమోదయింది. ఐతే ఇప్పుడీ వ్యవహారంలో ప్రశాంత్‌కు భారీ ఊరట లభించింది.

TRISHA KRISHNAN: త్రిష మీద పడ్డారేంటి.. ఎన్ని సార్లు.. ఇంత చీప్‌గా..?

తనకు, తన సోదరుడికి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పల్లవి ప్రశాంత్. నాంపల్లి కోర్టు బెయిల్‌లో ఇచ్చిన కండిషన్ రెండు నెలలు పూర్తి అయిందని పిటిషన్‌లో తెలిపాడు. రిలాక్సేషన్ కండిషన్ అప్లికేషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే తర్వాత.. పల్లవి ప్రశాంత్ విజేత ట్రోఫీతో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు అతడిని ఊరేగింపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం కావడానికి కారణం అయ్యారంటూ.. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిపై కేసులు నమోదయ్యాయ్. ఇందులో ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ2గా అతడి సోదురుడు మనోహర్, ఏ3గా వినయ్‌ను చేర్చి.. అరెస్ట్ చేశారు. ఐతే ఆ తర్వాత ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు.. కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో భాగంగా ప్రతీ ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీని మీదే ప్రశాంత్ పిటిషన్ వేయగా.. ఇప్పుడు భారీ ఊరట లభించింది.