PALLAVI PRASHANTH: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. హైదరాబాద్ తరలింపు..

గత ఆదివారం స్టార్ మా ఛానెల్‌కు చెందిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలే జరిగింది. ఈ షోలో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే, ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ హంగామా చేసి, వీరంగం సృష్టించారు.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 07:39 PM IST

PALLAVI PRASHANTH: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గజ్వేల్‌లో బుధవారం సాయంత్రం ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడు రవిరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్‌పై తొమ్మిది సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఆదివారం స్టార్ మా ఛానెల్‌కు చెందిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలే జరిగింది. ఈ షోలో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు.

SALAAR: ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా.. ఆఫ్‌లైన్‌లో సలార్ టిక్కెట్లా..?

అయితే, ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ హంగామా చేసి, వీరంగం సృష్టించారు. పలు కంటెస్టెంట్ల కార్లతోపాటు, ఆర్టీసీ అద్దాలను ధ్వంసం చేశారు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్.. ర్యాలీ తీయడం కూడా మరింత ఘర్షణలకు దారి తీసింది. అనుమతి లేకుండా ర్యాలీ తీయడం వల్ల అభిమానులు రెచ్చిపోయారని, ప్రశాంత్‌తోపాటు కొందరు అభిమానులపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ కోసం వెతికారు. కానీ, మంగళవారం నుంచి పల్లవి ప్రశాంత్‌ పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా సిద్ధిపేట జిల్లా, కొల్లూరులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

అయితే, అంతకుముందు పోలీసుల తీరుపై ప్రశాంత్ లాయర్ అసహనం వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు. కేసు నమోదు చేసి, కనీసం నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్‌ను సంప్రదించగా, ఎఫ్ఐఆర్ కాపీ కొసం కుటుంబ సభ్యులే రావాలి అని ఇన్స్పెక్టర్ చెప్తున్నట్లు వెల్లడించారు. “ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలిసిన బాధ్యత పొలిసులది. FIR కాపీ లేకపోవడం తో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తే తెలుస్తుంది” అని ఆయన తరఫు లాయర్ అన్నారు.