Prabhas: ప్రభాస్ పెంపుడు తల్లి వైరల్..

రెబల్ స్టార్ ప్రభాస్ మదర్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తన పెంపుడు తల్లి గురించే భారీగా చర్చజరుగుతోంది. కాకపోతే రియల్ లైఫ్ మదర్ కాకుండా సినిమాలో తన మదర్ పాత్రే పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ అయ్యింది.

  • Written By:
  • Updated On - July 29, 2023 / 05:28 PM IST

ఎందుకంటే సలార్ లో మదర్ సెంటిమెంట్ ఉందనగానే, ఇది మరో కేజీయఫ్ అంటున్నారు. కాని ఇది మరో కేజీయఫ్ కాదు, ఇది కేజీయఫ్ సీక్వెల్ లాంటిదే అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే కేజీయఫ్ లో రాఖీ భాయ్ తల్లి, సలార్ లో హీరో ప్రభాస్ కి కూడా తల్లేనట.

కేజీయఫ్ లో రాఖీ భాయ్ తల్లి పెంపుడు కొడుకే సలార్ లోప్రభాస్ పాత్ర అని తెలుస్తోంది. తల్లి కోసం , అలానే సోదరుడు లాంటి రాఖీ భాయ్ కి ఇచ్చిన మాటకోసం కేజీయఫ్ లో అడుగుపెట్టే సీన్ సలార్ లో ఉందట. అలా కేజీయఫ్ ని, సలార్ ని ప్రశాంత్ నీల్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కలిపాడని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ తో తీసే సినిమాకు ఈమూవీలతో లింక్ ఉంటుందని, అలా ఈ యూనిర్స్ కంటిన్యూ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. అంతేకాదు తారక్ తో సినిమా తర్వాత కేజీయఫ్ 3 ప్లాన్ చేస్తానంటున్న ప్రశాంత్ నీల్, అందులో ప్రభాస్ కామియో కూడా ఉండేలా చూసుకుంటున్నాడట. సలార్ సాంగ్ లాంచ్ విషయంలో ఫిల్మ్ టీం చర్చల తాలూకు అంశాలు లీకవ్వటంతో ఇలాంటి ప్రచారం మొదలైంది.