PAN INDIA MOVIES: 2024లో పాన్ ఇండియా మూవీల జాతరే.. లిస్ట్ ఇదీ..!

పటాన్, జవాన్ సందడి నార్త్ వరకే పరిమితం. సౌత్ లో కొంతవరకు ప్రభావంచూపించినా ఆహా, ఓహో అనే పరిస్థితి లేదు. కానీ, వచ్చే ఏడాది అలా ఉండదు. నెలకి కనీసం రెండు పాన్ ఇండియా మూవీలు దుమ్ముదులపబోతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 06:56 PM IST

PAN INDIA MOVIES: 2023లో పాన్ ఇండియా మూవీలేవి దుమ్ముదులపలేదు. ఆదిపురుష్, పొన్నియన్ సెల్వం.. ఇలా సౌతే కాదు.. నార్త్‌లో కూడా సందడి లేదు. పటాన్, జవాన్ సందడి నార్త్ వరకే పరిమితం. సౌత్ లో కొంతవరకు ప్రభావంచూపించినా ఆహా, ఓహో అనే పరిస్థితి లేదు. కానీ, వచ్చే ఏడాది అలా ఉండదు. నెలకి కనీసం రెండు పాన్ ఇండియా మూవీలు దుమ్ముదులపబోతున్నాయి.

జనవరిలో హనుమాన్ రానుంది. ఇది తెలుగు సినిమానే అయినా కార్తికేయ 2, కాంతారా కంటే ఎక్కువే సందడి చేస్తుందనే అంచనాలకు టీజర్‌‌లో విజువల్ క్వాలిటీయే కారణం. ఇక జనవరిలోనే ఓజీ, గుంటూరు కారం రానున్నాయి. ఈ రెండూ నార్త్ సంగతేమో కాని సౌత్ మొత్తం సందడి చేసే ఛాన్స్ ఉంది. ఇక ఏప్రిల్ 5 కి ఎన్టీఆర్ దేవర రాబోతోంది. మే 9 కి రెబల్ స్టార్ కల్కి.. సైంటిఫిక్ ఫిక్సన్ రానుంది. ఈ డేట్లన్ని ఆల్ మోస్ట్ లాక్ అయ్యాయి. ఇక దసరాకు రామ్ చరణ్ శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ రావొచ్చని తెలుస్తోంది. దీనికి కనీసం రెండు నెలల ముందు పుష్ప 2 రిలీజ్ ఎప్పుడో తేలిపోయింది.

ఆగస్ట్ 15 న ఇది వస్తుంటే, పూరీ మూవీ డబుల్ ఇస్మార్ట్ నుంచి హరి హర వీరమల్లు వరకు సినిమాలు దాడి చేయటం కన్ఫామ్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ సంక్రాంతికి మిస్ అయితే సమ్మర్ అంటున్నారు. విజయ్ దేవరకొండతో పరశురామ్ తీసే సినిమా సంక్రాంతికే అని తేల్చారు. ఇక ఆగిపోయిన పవన్ మూవీ హరి హర వీరమల్లు వచ్చే ఏడాది దసరాకే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా తెలుగు నుంచే 15 వరకు పాన్ ఇండియా మూవీలు వచ్చే ఏడాది మీద దాడి చేయబోతున్నాయి. అదే తమిళ్ నుంచి భారతీయుడు 2 మాత్రమే రానుంది. హిందీలో హ్రితిక్ ఫైటర్ తప్ప అంచనాలను ఆకాశానికెత్తేలా ఖాన్లు, కపూర్ల సందడి కష్టమే అనుకోవాల్సి వస్తోంది.