సలార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ 700 కోట్లు వసూలు చేసి ప్రభాస్ (Prabhas) స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైనప్పటికీ.. షారుఖ్ పై యంగ్ రెబల్ స్టార్ దే పైచేయిగా నిలిచింది. ఇంత భారీ హిట్‌ను అందుకున్నప్పటికీ.. ఈ మూవీ కొన్ని ఏరియాల్లో మాత్రం నష్టాలు మూటగట్టుకుంది. దీంతో.. నిర్మాత విజయ్ కిరగందూర్ డబ్బులు తిరిగి చెల్లిచారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది
సలార్ మూవీ పలు ఏరియాల్లో నష్టాలు మిగిల్చినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సలార్ హక్కులు (Salar rights) 150 కోట్ల వరకు అమ్మడుపోయాయి. నైజాం హక్కులు మైత్రీ మూవీ మేకర్స్ 60 కోట్లకు దక్కించుకుందట.. ఇక ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు 90 కోట్లకు సలార్ హక్కులు కొన్నారు. అయితే.. నైజాం లో బ్రేక్ ఈవెన్ అయిన సలార్ ఏపీలో మాత్రం దెబ్బేసింది. దీంతో.. సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ నష్టాల్లో కొంత మేర తిరిగి చెల్లించారట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ… ఈ న్యూస్ మాత్రం నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది.
కాగా.. మేకర్స్ ఇప్పటికే సలార్ సీక్వెల్ ప్రకటించారు. శౌర్యంగ పర్వం (Sauryanga Parvam) పేరుతో రెండవ భాగం తెరకెక్కనుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అసలు కథ మొత్తం పార్ట్ 2 లోనే చూపించనున్నాడు. జూన్ లేదా జులై నెలలో సలార్ 2 పట్టాలెక్కనుంది. ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్న నేపథ్యంలో.. సలార్-2 (Salaar-2) పట్టాలెక్కడం లేట్ అవుతుందని అందరూ భావించారు. అయితే.. ఇటీవల పృథ్విరాజ్ సుకుమారన్ దీనిపై అప్డేట్ ఇచ్చాడు. సలార్ 2 షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రాణ మిత్రులైన దేవ-వరదరాజులు బద్ద శత్రువులు అవుతారు..? అన్న అసలైన పాయింట్ కు పార్ట్-2లోనే సమాధానం దొరకనుంది. సలార్ 2లో బాబీ సింహ, ఈశ్వరి రావు, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నారు.