Pushpa 3 : పార్ట్-3 కన్ఫర్మ్ చేసిన పుష్ప..!

టాలీవుడ్ (Tollywood) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) డైరెక్షన్ విడుదలైన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీలో అల్లు అర్జున్ మేనజరింగ్‌కు వరల్డ్ వైడ్‌గా సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాలోని డైలాగ్స్‌కు సెలబ్రిటీలు సైతం పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో..దీనికి సీక్వెల్‌గా వస్తన్న పుష్ప-2 (Puspa2) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

టాలీవుడ్ (Tollywood) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) డైరెక్షన్ విడుదలైన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీలో అల్లు అర్జున్ మేనజరింగ్‌కు వరల్డ్ వైడ్‌గా సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాలోని డైలాగ్స్‌కు సెలబ్రిటీలు సైతం పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో..దీనికి సీక్వెల్‌గా వస్తన్న పుష్ప-2 (Puspa2) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన పో స్టర్లు ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఫ్యాన్స్‌కు మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు బన్నీ.. పుష్ప-3 పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో.. ఫ్యాన్స్‌లో పూనకాలు లోడ్ అయిపోతున్నాయి.

పుష్పను ప్రాంచైజీ గా చేయాలని చూస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపాడు. జర్మనీలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక 74వ బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) పాల్గొన్నాడు. ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా పుష్ప 3పై కూడా రియాక్ట్ అయ్యాడు. పుష్ప-2 సినిమా.. మొదటి పార్ట్ కంటే అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. క్యారెక్టరైజేషన్ పరంగా పుష్ప 1లో చూసింది చాలా తక్కువ. కానీ పుష్ప 2లో అసలు క్యారెక్టర్ చూస్తారు. దీంతోపాటు.. మీరు మూడో పార్ట్ ని కూడా ఆశించవచ్చంటూ పుష్ష-3 పై కుండబద్దలు కొట్టేశాడు.

నిజానికి పుష్ప సినిమాను ఒక్క పార్ట్‌లోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశాడు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. ఇక పుష్ప-1 (Puspa1) అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ (India Star) గా మార్చింది. 2021లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని అద్భుతమైన నటనకు గాను బన్నీ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు ఆగస్టులో విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో ‘పుష్ప 3’ కూడా ఉండబోతోందని సాక్షాత్తూ బన్నీనే హింట్ ఇవ్వడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.