Pavithra Naresh: లేటు వయసులో ఘాటు ప్రేమ ఇదేం ఖర్మరా నాయనా..

నరేష్‌, పవిత్ర లోకేష్‌. చాలా రోజుల నుంచి ఇంటర్నెట్‌లో వీళ్లిద్దరే ట్రెండింగ్‌ టాపిక్‌. హోటల్‌ రూంలో దొరకడం ఐపోయింది. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడం ఐపోయింది. మళ్లీ పెళ్లి అంటూ వీడియోలు పెట్టడం ఐపోయింది. ఇప్పుడు ఈ దరిద్రం రియాల్టీ షోలను కూడా పట్టుకుంది. ఓంకార్‌ డైరెక్షన్‌లో మా టీవీలో వస్తున్న సిక్స్త్‌ సెన్స్‌ సీజన్‌-5 కి పవిత్ర, నరేష్‌ను గెస్ట్‌గా పిలిచాడు ఓంకార్‌. చాన్స్‌ దొరికింది కదా అని వీళ్లిద్దరూ స్టేజ్‌ మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వాళ్ల ఇన్‌డైరెక్ట్‌ డైలాగ్స్‌కు సరసాలకు ఆడియన్స్‌ చిర్రెత్తిపోయారు.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 06:28 PM IST

ఈ రియాలిటీ షోలో వాళ్లిద్దరి రిలేషన్‌ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాడు నరేష్‌. ఆకాశం విరిగివచ్చి భూమి మీద పడ్డా సరే.. మేము విడిపోమంటూ చెప్పాడు. నరేష్‌ చెప్పిన డైలాగ్‌కు పవిత్ర పొంగిపోయి నరేష్‌ మీద ముద్దుల వర్షం కురిపించింది. వాళ్ల ప్రేమకు ఆడియన్స్‌ ఫిదా అవుతారనుకున్నారేమో.. తెగ సరసాలాడారు. కానీ అమ్మనాబూలు తిడుతున్నారు ఆడియన్స్‌. మీ ఏజ్‌కి మీరు చేస్తున్న పనులకు ఏమైనా సంబంధం ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సిగ్గు లేకుండా స్క్రీన్‌ మీద ఆ ముద్దులు ఏంటని చివాట్లు పెడుతున్నారు. వీళ్ల డైలాగ్‌లు అన్నీ ఒకెత్తు ఐతే.. సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల మధ్య ప్రేమ గురించి వివరించి.. విపులీకరించి చెప్పాడు నరేష్‌. ప్రేమకు తాను బ్రాండ్‌ అంబాసిడర్‌ ఐనట్టు వాళ్ల మధ్య ఉండే ఆప్యాయత గురించి స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. దీంతో ఈ పాయింట్‌ మీద కూడా నరేష్‌ను వేసుకున్నారు ఆడియన్స్‌.

జీవితంలో భార్య అనే స్థానానికి అంత గౌరవం ఇచ్చేవాడివి ఐతే ఒకర్ని విడిచి ఒకర్ని మారుస్తూ.. మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నావంటూ కామెంట్లు పెట్టారు. ఈ దరిద్రాన్ని రియాల్టీ షోలో చూడటమే దారుణం అనుకుంటే.. సూపర్‌ స్టార్‌ కృష్ణను ఇమిటేట్‌ చేస్తూ “జుంబారే జుజుంబారే” సాంగ్‌కు డాన్స్‌ చేశాడు నరేష్‌. అచ్చూ కృష్ణలా స్టెప్స్‌ వేసేందుకు ప్రయత్నించాడు. ఈ పనికి మాత్రం ఫ్యాన్స్‌ తిట్టని తిట్టు లేదు. నిజానికి ఇలా ఎవరైనా కృష్ణను కామెడీగా ఇమిటేట్‌ చేసి డాన్స్‌ చేస్తే మహేష్‌ బాబుకు అసలు నచ్చదు. సీరియస్‌ అవుతాడు. కానీ ఇప్పుడు నరేష్‌ పబ్లిక్‌గా స్టేజ్‌ మీద కృష్ణను ఇమిటేట్‌ చేస్తూ తన పరువు తీసుకుని కృష్ణగారి పరువు కూడా తీశాడు.

ఈ పనికి కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఎన్ని మాటలు అని ఉంటారో మీరే ఇమాజిన్‌ చేసుకోండి. వీళ్లు ప్రోగ్రాంకు రావడం ఏంటో కాని అటు ఓంకార్‌ని కూడా ఆడుకుంటున్నారు నెటిజన్లు. షోకు తీసుకువచ్చేందుకు వీళ్లకంటే బెటర్‌ సెలబ్రిటీలు దొరకలేదా నీకు అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది. వెంటనే చూస్తే చూడండి కానీ కామెంట్స్‌ సెక్షన్‌ మాత్రం ఓపెన్‌ చేయకండి.