నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు రావడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ ఆరోపించింది రమ్య. అంతే కాదు పవిత్ర, నరేష్ బెంగళూరులో ఓ హోటల్‌లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది కూడా. ఓ పక్క ఈ ఇష్యూ హాట్ హాట్‌గా ఉండగానే పవిత్ర నరేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరూ లిప్‌లాక్ చేసుకున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తమ ఇల్లీగల్ ఎఫైర్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారని అంతా అనుకున్నారు.
ఆ తరువాత కొన్ని రోజులకే పెళ్లి వీడియోను కూడా పోస్ట్ చేశాడు నరేష్. ఈ వీడియో చూసేందుకు సినిమాలా అనిపించడంతో చాలా మంది కన్ఫ్యూజన్‌లో పడ్డారు. తరువాత మళ్లీ పెళ్లి అనే సినిమా తాను తీస్తున్నట్టు, ఆ సినిమాలోనిదే ఈ పెళ్లి సీన్ అని తెలిసి అంతా షాకయ్యారు. ఇప్పుడు మళ్లీ పెళ్లి సినిమా టీజర్ రిలీజ్ చేసి మరోసారి ఆడియన్స్ నరాలు కట్ అయ్యేలాంటి షాకిచ్చాడు నరేష్. తన ఫ్యామిలీ ఇష్యూనే సినిమాగా తీశాడు. తన భార్యతో ఉన్న గొడవలు, రమ్య రఘుపతి మీడియా ముందుకు రావడం, హోటల్ రూంలో ఉన్నప్పుడు పట్టుకోవడం ఇవన్నీ సినిమాలో పెట్టేశాడు.
న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేసిన లిప్‌లాక్ సీన్ కూడా సినిమాలో ఉంది. దీంతో ఇప్పటి దాకా నరేష్ రిలీజ్ చేసిన వీడియోస్ అన్నీ ఈ సినిమా కోసం తీసినివే అని క్లారిటీ వచ్చింది. తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సినిమా తీస్తున్నట్టు నరేష్ చెప్పాడు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. టీజర్ కట్ చేసిన తీరు చూస్తుంటే.. సినిమాలో నరేష్ తన భార్య రమ్యను విలన్‌గా చూపిస్తూ సినిమా తీసినట్టు తెలుస్తోంది.
కాస్టింగ్ విషయంలో కూడా తన భార్యకు దగ్గరి పోలికలతో ఉండే వనిత విజయకుమార్‌ను తీసుకున్నాడు నరేష్. మేలో ఈ సినిమా రిలీజ్ కానుంది. టీజర్ చూసిన ఆడియన్స్ మాత్రం ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ఇదేం ట్విస్ట్ బాబోయ్ అంటూ షాకవుతున్నారు. ఎంఎస్ రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాతో తమపై అల్లుకున్న వివాదం, తమ బంధం గురించి నరేష్, పవిత్ర గట్టిగా చెప్పబోతున్నట్టున్నారు.