PAWAN KALYAN: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ టేస్ట్, ఘాటు ఏకంగా పాకిస్థాన్‌కి చేరినట్టుంది. అక్కడి వాళ్లకు నచ్చినట్టుంది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో తెగ చూస్తున్నారక్కడ. హిందీ వర్షన్ ఓటీటీలో అందుబాటులోకి రాగానే, నార్త్ ఇండియా జనాలే ఫిదా అయ్యారు. ఇప్పుడు పాకిస్థానీలతోపాటు బంగ్లాదేశీలకు కూడా గుంటూరు కారం బాగా నచ్చినట్టుంది.
Ram Charan: జరగండి.. వస్తున్నాడు..! చరణ్ ఫ్యాన్స్‌కు థమన్ గుడ్ న్యూస్
పాకిస్థాన్, బాంగ్లాదేశ్ ఓటీటీల్లో దూసుకెళుతున్న టాప్ 10 మూవీస్‌లో ఐదో స్థానంలో గుంటూరు కారం ఉంది. హిందీ వర్షన్‌కి పాక్, బంగ్లా దేశియులే కాదు, నేపాల్‌తోపాటు దుబాయ్ నుంచి కూడా స్పందన వస్తోంది. అచ్చంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి కూడా ఇలానే జరిగింది. సాయి తేజ్‌తో పవన్ చేసిన బ్రో మూవీ థియేటర్స్‌లో అంతగా వసూళ్లు రాబట్టలేకపోయినా, ఓటీటీలో మాత్రం దూసుకెళ్ళింది. హిందీవర్షన్ అయితే ఓటీటీలోకి రాగానే అదో సునామీలా మారిపోయింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో ఓటీటీ మూవీస్‌లో బ్రో సినిమా నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఒకప్పుడు పాక్, బంగ్లా ప్రేక్షకులకు హిందీ సినిమాలే దిక్కు. కాని ఇప్పుడు ఖాన్లూ.. కపూర్లను కాదని, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ అంటూ తెలుగు హీరోల సినిమాలకు ఫిదా అవుతున్నారు పాక్, బంగ్లా జనాలు.