Bro Trailer: బ్రో ట్రైల‌ర్ వచ్చేసింది.. మామా అల్లుడు దుమ్ములేపారు..

మామా అల్లుడుల్ల కాంబినేషన్ అంటే అంచనాలు కూడా ఓ రేంజులోనే ఉంటాయి .. ఇద్దరు మేగా హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడ్డానికి మేగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 08:15 PM IST

మొన్నామధ్య వచ్చిన ఆచార్య సినిమా దారుణంగా నిరాశపరచడంతో ఇప్పుడు బ్రో సినిమా పైనే ఆశాలు పెట్టుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సముద్ర ఖని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జులై 28న విడుదల కానుంది.

ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.ఈ క్రమంలో బ్రో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ , తేజ్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు అభిమానులు. త్రివిక్రమ్ ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సినిమా యూనిట్ ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ మాములుగా లేదు . ముఖ్యంగా సాయి ధ‌ర‌మ్ తేజ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా? మీ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వరు అని పవన్ కళ్యాణ్ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. త‌రువాత సాయి ధరమ్ తేజ్ ను పరిచయం చేశారు. అతని ప్రియురాలిగా కేతికా శర్మ క‌నిపిస్తుంది. ఇక ప్రతిదానికీ తనకు టైమ్ లేదని అంటుంటాడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. టైమ్ లేద‌ని చెప్పే హీరోకి టైమ్ ఎదురైతే ఏమైందనేది క‌థ‌గా తెలుస్తోంది.