మూడురోజులు కలెక్షన్ల వర్షం కురిపించిన బ్రో మూవీ.. ఆ తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోయింది. పొలిటికల్ మసాలా ఎక్కువగా ఉండడంతో.. ఓ వర్గం ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉన్నారు. పవన్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై బజ్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. ఓపెన్ అయిన అన్ని చోట్ల ఈ సినిమాకు అద్భుతమైన బుకింగ్స్ నమోదయ్యాయ్. అది కలెక్షన్స్ రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రో మూవీ.. ఓవరాల్‌గా ఇప్పటివరకు వంద కోట్ల కలెక్షన్లు దాటేసింది.
ఇదే.. పవన్ కల్యాణ్ ఖాతాలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా మూడు రీమేక్‌ల్లో యాక్ట్ చేసి.. అన్ని సినిమాలకు వంద కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోగా పవన్ రికార్డు క్రియేట్ చేశాడు. వకీల్‌సాబ్, భీమ్లా నాయక్, బ్రో మూవీలతో వరుసగా మూడు సినిమాలు 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయ్. ఈ మూడు కూడా పక్క భాషల్లో హిట్టైన రీమేక్ మూవీస్ కావడం విశేషం. ఒక రకంగా పవన్ కళ్యాణ్ రేర్ రికార్డు అనే చెప్పాలి. ఇక అటు బ్రో మూవీ ప్రపంచవ్యాప్తంగా 97 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 98 కోట్ల 50లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు 38 కోట్ల కోట్ల దూరంలో ఉంది. మొత్తంగా వర్షాల ఎఫెక్ట్ ఈ సినిమాపై పడకపోయినా.. నాలుగో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్‌లో ఫుల్ డ్రాప్ కనిస్తోంది. మొత్తంగా ఈ వారం లోపు బ్రేక్ ఈవెన్ సాధించకపోతే.. ఆ తర్వాత బ్రో కోలుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.