Upasana Kamineni: మండిపాటు.. ఉపాసనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తన యాక్టివిటీస్‌ గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది.

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 04:17 PM IST

Upasana Kamineni: సినిమా రంగానికి, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. సినీ రంగం నుంచి ఎంతోమంది రాజకీయాల్లోకి వెళ్ళి రాణించారు. అయితే రాజకీయ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు ఎవరూ లేరనే చెప్పాలి. సినిమాల్లో వచ్చిన పాపులారిటీతోనే రాజకీయాల్లోకి వెళతారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తను పెట్టబోతున్న కొత్త పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ పేరును ప్రకటించారు.

Vyooham: ఆర్జీవీకి ఊరట.. వ్యూహం సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొందరు కొన్ని సూచనలు కూడా చేశారు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తన యాక్టివిటీస్‌ గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతోపాటు రాజకీయాల గురించి కూడా ప్రస్తావించడం విశేషం. తనకు రాజకీయాల్లో రావాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే సమాజంలో మార్పు తీసుకొచ్చే నాయకుడికి తను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. హీరో విజయ్‌ రాజకీయాల్లో ప్రవేశించడంపై ఉపాసన స్పందిస్తూ సినీ పరిశ్రమ నుంచి ఎందరో రాజకీయాల్లోకి వెళ్ళారు. కొందరు ముఖ్యమంత్రులుగా కూడా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరో విజయ్‌ నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే లీడర్‌ ఎవరైనా సరే సపోర్ట్‌ చేయాలనేది నా అభిప్రాయం.

ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్‌ చేయకపోయినా.. వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్‌ గొప్ప రాజకీయ నాయకుడు అవుతారన్న నమ్మకం నాకు ఉందన్న కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటివరకు తన చిన్న మావయ్య అయిన పవన్‌కళ్యాణ్‌ గురించి, ఆయన నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు ఉపాసన. ఇప్పుడు సడన్‌గా విజయ్‌ని సపోర్ట్‌ చేయడం పవన్‌ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా పవన్ రాజకీయాల గురించి ఎప్పుడు స్పందించాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే సమాజంలో మార్పు రావాలని కోరుకునే నాయకుడికి తాను మద్దతు ఇస్తానని చెప్పడంతో తమ హీరో పవన్‌కళ్యాణ్‌ని కూడా దృష్టిలో పెట్టుకునే ఆ వ్యాఖ్యలు చేసిందని పవర్‌స్టార్‌ అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు.