Pawan Kalyan: బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. వింటేజ్ పవన్ కల్యాణ్ దర్శనం జరిగింది థియేటర్లలో..! పవన్ హిట్ సినిమాల రిఫరెన్స్‌లన్నీ దాదాపుగా వాడేశారీ మూవీలో. పవన్‌ను చూసి పూనకాలు ఒక్కటే తక్కువ అభిమానులకి. తమిళ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌గా బ్రో సినిమా తెరకెక్కింది. ఒరిజినల్‌తో కంపేర్ చేస్తే.. బ్రో మూవీలో చాలా మార్పులు చేశారు. తెలుగు నేటివిటీకి తగినట్లు.. తన పెన్‌కు పని చెప్పిన త్రివిక్రమ్.. పవన్‌కు మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ అందించాడు.
బ్రో మూవీ కలెక్షన్లు ఎంత వస్తాయన్న సంగతి పక్కనపెడితే.. పవన్‌కల్యాణ్ కెరీర్ ఈ స్థాయిలో ఉంది అంటే.. అది రీమేక్‌ల కారణంగానే! కెరీర్‌లో ఇప్పటివరకు హీరోగా 28 సినిమాలు చేస్తే.. అందులో ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా 12 రీమేక్‌లు చేశాడు పవన్. హైలైట్ ఏంటంటే.. ఒకటి రెండు మినహాయిస్తే దాదాపు అన్నీ సూపర్ హిట్లే ! అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో పవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. ఇది హిందీ మూవీ ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీకి రీమేక్. ఇక ఆ తర్వాత గోకులంలో సీత అనే చేయగా సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇది తమిళ్ మూవీ గోకులతిల్ సీతై మూవీకి రీమేక్. సుస్వాగతంతో కెరీర్‌లో పవన్ ఫస్ట్ భారీ హిట్ అందుకున్నాడు. ఇది కూడా తమిళ్ మూవీ లవ్‌టుడేకు రీమేక్.
ఇక ఖుషీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తమిళ్‌లో విజయ్ హీరోగా నటించిన ఖుషీ మూవీకి రీమేక్. ఆ తర్వాత అన్నవరం సినిమాతో మరో రీమేక్ చేశాడు పవన్. ఇది తమిళ హీరో విజయ్ యాక్ట్ చేసిన తిరుపాచి సినిమాకు రీమేక్. ఇక ఆ తర్వాత జయంత్ సీ పరాన్జీ డైరెక్షన్‌లో తీన్‌మార్‌లో యాక్ట్ చేయగా అది కల్ట్ మూవీగా నిలిచింది. ఇది హిందీ మూవీ లవ్ ఆజ్ కల్‌కు రీమేక్. పవన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు.. కెరీర్ గాడిలో పడేసిన మూవీ గబ్బర్ సింగ్. సల్మాన్‌ఖాన్ హీరోగా యాక్ట్ చేసిన దబాంగ్ మూవీకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్లు హరీష్‌శంకర్ భారీ మార్పులు చేయగా.. బాక్సాఫీస్ దుమ్ము దులిపింది ఈ మూవీ. దాదాపు 11 సినిమాల తర్వాత పవన్‌కు ఒక హిట్ పడింది ఈ సినిమాతోనే ! గోపాల గోపాలతో హీరో వెంకటేష్‌తో మల్టీస్టారర్‌లో చేయగా.. ఇది హిందీ మూవీ ఓ మై గాడ్‌కు రీమేక్. ఆ తర్వాత కాటమరాయుడు స్క్రిప్ట్‌కు ఓకే చెప్పగా.. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన వీరం మూవీకి ఇది రీమేక్.
ముగ్గురు అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసే లాయర్ కథతో తెరకెక్కిన మూవీ వకీల్‌సాబ్. అమితాబ్ లీడ్ రోల్ చేసిన పింక్ మూవీకి రీమేక్ ఇది. ఇక ఆ తర్వాత భీమ్లానాయక్ స్క్రిప్ట్ ఓకే చేయగా.. మళయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్‌కు రీమేక్ ఇది. ఫైనల్లీ ఇప్పుడు బ్రో మూవీ. ఇది తమిళ సినిమాకు రీమేక్. ఇలా పవన్ కల్యాణ్ కెరీర్‌లో రీమేక్‌లు కీ రోల్ ప్లే చేశాయ్. పవన్‌కు ఈ లెవల్ స్టార్‌డమ్ వచ్చిందంటే.. డైరెక్ట్ స్క్రిప్ట్‌ల కంటే.. ఒకరకంగా రీమేక్‌లో మెయిన్ రోల్ ప్లే చేశాయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.