PAWAN KALYAN: తెరమీద చెప్పిందే.. ఆర్జీవీ వ్యూహంలో చెప్పినట్టే పవన్‌ను తొక్కేస్తున్నారా..?

పవన్ కల్యాణ్‌కి ఎవరూ వెన్నుపోటు పొడవక్కర్లేదు. అతనే ముందు పోటు పొడుచుకుంటాడు అని రాం గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాలో డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇదే రియల్‌గా ఏపీ పాలిటిక్స్‌లో కనిపిస్తోందని అంటున్నారు నెటిజెన్స్.

  • Written By:
  • Updated On - March 13, 2024 / 03:31 PM IST

PAWAN KALYAN: ఆర్జీవీ వ్యూహం మూవీలో చెప్పినట్టే.. ఇప్పుడు నిజ జీవితంలో పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతోందా.. నెటిజెన్స్ ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్‌ని పావుగా వాడుకుంటాడనీ.. ఫైనల్‌గా లోకేశ్‌ని హీరోని చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. ఆర్జీవీ వ్యూహం మూవీలోని కేరక్టర్లతో చెప్పించాడు. రియల్‌గా పవన్ కల్యాణ్‌ని లోక్‌సభకు పోటీ చేయించడంలో చంద్రబాబు వ్యూహం కూడా ఇదే అంటున్నారు.

Rc16 : చెర్రీ స‌ర‌స‌న ఆ హీరోయిన్ ఫిక్స్..?

పవన్ కల్యాణ్‌కి ఎవరూ వెన్నుపోటు పొడవక్కర్లేదు. అతనే ముందు పోటు పొడుచుకుంటాడు అని రాం గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాలో డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇదే రియల్‌గా ఏపీ పాలిటిక్స్‌లో కనిపిస్తోందని అంటున్నారు నెటిజెన్స్. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలుంటే.. పవన్‌కు కనీసం 50 నుంచి 60 దాకా ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ జనసేనకు 24 సీట్లు కేటాయించారు బాబు. మళ్ళీ అందులో బీజేపీ కోసమని మరో మూడు స్థానాలు త్యాగం చేయించారు. 144 సీట్లు తన దగ్గర పెట్టుకున్న చంద్రబాబు.. జనసేనకే ఎందుకు కోత పెట్టారని పవన్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. బాబు తొక్కేస్తున్నా పవన్ ఎందుకు కామ్‌గా ఉంటున్నాడో అర్థం కావట్లేదని అంటున్నారు. ఆర్జీవీ వ్యూహం మూవీలో చెప్పినట్టు పవన్ తనకు తాను ముందు పోటు పొడుచుకుంటున్నాడా..? ఆర్జీవీ చెప్పిందే జరుగుతోందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. వ్యూహం మూవీలో ఇంకో డైలాగ్ కూడా పవన్ కల్యాణ్‌కి సరిగ్గా సరిపోతోంది.

పవన్ గెలిచి నాయకుడు అయితే.. ఇంకెవ్వరూ టీడీపీ వైపు చూడరు. అందుకే అతను ఓడిపోయేట్టు చేయాలని చంద్రబాబు తన పార్టీ నాయకులతో చెప్పినట్టు ఆర్జీవీ మూవీలో ఓ సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏపీలో పవన్ కల్యాణ్‌ని లోక్ సభకు పోటీ చేయించడం వెనక ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదే అంటున్నారు. పవన్ ఎమ్మల్యేగా కాకుండా.. ఎంపీగా పోటీ చేస్తే.. గెలుస్తాడో లేదో తర్వాత సంగతి. ఏపీలో లోకేశ్‌కి అడ్డం లేకుండా పోతారని ప్లాన్ చేశారని అంటున్నారు కొందరు నెటిజెన్స్. టీడీపీ వాళ్ళే గెలవాలి.. పూర్తిగా తమ వల్లే ప్రభుత్వం ఏర్పడాలన్న ఆలోచనతో చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను తొక్కేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఆర్జీవీ చెప్పినట్టే జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు.