బన్నీ విషయాలేవీ పవన్‌ మర్చిపోలేదా.. పుష్పరాజ్‌కు చుక్కలు తప్పవా..

  • Written By:
  • Updated On - August 8, 2024 / 09:16 PM IST

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ మంథ్‌ పుష్ప 2 రిలీజ్‌ కావాల్సింది. ఐతే ఆ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. షూటింగ్‌ ఆలస్యం అని కారణాలు చెప్తున్నా.. అసలు రీజన్‌ మాత్రం వేరే అన్నది మెజారిటీ ఫ్యాన్స్ ఒపీనియన్‌. ఏపీ ఎన్నికల సమయంలో.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇంటికి వెళ్లడమే కాకుండా.. ఆయన తరఫున ప్రచారం కూడా చేశారు బన్నీ. ఆ సంఘటన తర్వాత మెగా ఫ్యామిలీలో కనిపించిన కుదుపులు అన్నీ ఇన్నీ కావు. అల్లువారింటికి, కొణిదెల కుటుంబానికి దూరం పెరిగిందని.. ఇప్పట్లో దగ్గరవడం కష్టమే అని రకరకాల చర్చ జరిగింది. ఇక పవన్‌ విజయంపై బన్నీ కూడా పెద్దగా రియాక్ట్ కాకపోవడం.. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఇక మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ మీద గుర్రుగా ఉన్నారని.. ఆయన సినిమా చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదని.. అందుకే రిలీజ్ వాయిదా పడుతుందన్న టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌ చేసిన వ్యాఖ్యలు.. మరింత ఆసక్తి రేపుతున్నాయ్. ముఖ్యంగా పుష్ప మూవీ గురించే సేనాని మాట్లాడినట్లు కనిపిస్తోంది. వైసీపీకి మద్దతుగా నిలబడి బన్నీ చేసిన పనులేవీ.. పవన్‌ మర్చిపోయినట్లు కనిపించడం లేదు అనే టాక్‌ వినిపిస్తోంది. 40ఏళ్ల కింద సినిమాల్లో హీరోలు అడవుల్ని కాపాడేవారని.. ఐతే ఇప్పుడు హీరోలు ఏకంగా అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు పవన్‌. అసలే మూవీ రిలీజ్ లేట్ అవుతుందని తెగ బాధపడుతున్న ఫ్యాన్స్‌కు పవన్ కామెంట్స్‌తో షాక్ తగిలినట్లు అయింది.

చెట్లు నరికి వ్యాపారం చేసే హీరో పాత్రలతో ఉన్న సినిమాలు తాను చేయలను.. చూడలేను అంటూ పవన్ చేసిన కామెంట్లు.. పుష్ప 2 మీద భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. పవన్‌ ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ స్టార్‌ ఫ్లాప్‌ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా.. పెద్ద హీరో హిట్‌ సినిమాకు రావు. అదీ మనోడి రేంజ్. అలాంటి హీరో ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయను, చూడను అంటే.. పుష్ప2కు, బన్నీకి కచ్చితంగా దెబ్బ పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ తరఫున బన్నీ ప్రచారం చేయడాన్ని.. పవన్ ఫ్యాన్‌ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా సినిమా గురించి పరోక్షంగా పవన్ వ్యాఖ్యలు చేయడం.. వాళ్ల కోపాన్ని, అసహనాన్ని, అసంతృప్తిని మరింత పెంచే ప్రమాదం ఉంటుంది. దీంతో పుష్ప 2 ఫలితం మీద అది కచ్చితంగా ప్రభావం చూపే చాన్స్ ఉంటుంది. ఇదే జరిగితే పుష్పరాజ్‌కు, టీమ్‌కు చుక్కలు కనిపించడం ఖాయం. పవన్ కామెంట్లు ఇక్కడితో ఆగే అవకాశం లేదు. సోషల్‌ మీడియాలో భారీ చర్చకు దారి తీసే అవకాశాలు ఉంటుంది. దీంతో మరి ఇప్పుడు మరో కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. పుష్ప 2 మూవీని డిసెంబర్‌లో రిలీజ్ భావించారు. ఇప్పుడు పవన్ కామెంట్లతో రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడుతుందా.. ఈ నెగిటివిటీ నుంచి బయటపడాలంటే.. బన్నీ ముందు ఉన్న మార్గం అదొక్కటేనా అనే చర్చ జరుగుతోంది. మరికొందరు అయితే.. పవన్ ఏదీ మర్చిపోలేదని.. టైమ్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తారు.. ఇచ్చారు కూడా అంటూ.. పోస్టులు పెడుతున్నారు.