పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా? అని దర్శకనిర్మాతలు ఎదురు చూశారు. కానీ.. ఇప్పుడు ఎప్పుడు రాజకీయ సభలకు వస్తాడా? అని జన సైనికులు వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ లేకపోతేనే.. పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నాడు. ఆమధ్య గ్యాప్ రావడంతో.. చంద్రబాబును కలిసి.. వెంటనే OG షూట్‌లో జాయిన్ అయ్యాడు. ముంబాయ్ షెడ్యూల్ ముగిసిందో లేదో.. ప్రియాంకమోహన్‌తో కలిసి పాట పాడుతున్నాడు. మహాబలేవ్వర్‌లో మూడు రోజులపాటు ఈ సాంగ్‌ను షూట్ చేస్తారు.
పవన్ ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నాడు. ‘వినోదయ సిత్తమ్’ రీమేక్‌లో తన పార్ట్ షూట్ పూర్తిచేశాడు. ఉస్తాద్ భగత్‌సింగ్ షెడ్యూల్ పూర్తి చేసి oG షూట్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం తీస్తున్న సాంగ్ పూర్తికాగానే.. ‘హరిహర వీరమల్లు’ షూట్ మొదలవుతుంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి పవన్ 60 రోజులు డేట్స్ ఇస్తే.. సినిమా పూర్తవుతుంది. అలాగే.. ఉస్తాద్‌కు ఇంకో రెండు నెలలు డేట్స్ ఇస్తే సరిపోతుంది. అక్టోబర్ నాటికి నాలుగు సినిమాలు పూర్తి చేయాలన్న పట్టుదలతో వున్నాడు పవన్.
2024 మేలో ఎ.పి ఎన్నికలు జరగడంతో.. సెట్స్‌పై వున్న నాలుగు సినిమాలను మార్చిలోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు పవన్. ఇంకా టైటిల్ పెట్టకపోయినా.. ‘వినోదయ సిత్తమ్’ రీమేక్ ముందుగా జులై 28న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో మొదలు మార్చిలోపు 8 నెలల్లో 4 సినిమాలతో సందడి చేయనున్నాడు పవన్. అందుకేనేమో.. రెండు నెలలుగా రాజకీయాల జోలికి వెళ్లకుండా.. సినిమాలే లోకంగా బతికేస్తున్నాడు పవన్.
ప్రభాస్ మినహాయిస్తే.. ఏ స్టార్ హీరో చేతిలో ఇన్ని సినిమాలు లేవు. ఒకటీ అర సినిమాలు చేసే పవన్ ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం వెనుక రెమ్యునరేషన్ కీరోల్ పోషిస్తోంది. పార్టి నడిపించడానికే సినిమా చేస్తున్నానని.. రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నానని పవనే స్వయంగా చెప్పాడు. ఎప్పుడూ లేనిది ఈ వరుస సినిమాలు చేయడం వెనుక.. పార్టీ అవసరాలు కూడా వున్నాయి. అంతే కాదు ఎన్నికల ప్రచారం..ఆ తరవాత అంత బాగుంటే అసెంబ్లీ లో కూర్చుంటాడు కనుక సినిమాలన్నీ క్లీన్ చేసుకోవాలని కృత నిశ్చయం తో ఉన్నదట పవన్ కళ్యాణ్