Pawan Kalyan: జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్ పవన్‌ కళ్యాణ్‌.. ప్లానింగ్‌ మామూలుగా లేదుగా..

ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకున్న ఓజీ సినిమా మూడో షెడ్యూల్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. కానీ పవన్‌ టాకీ పార్ట్‌ ఇంకా స్టార్ట్‌ కాలేదు. హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో పాటు కొందరు కీ యాక్టర్స్‌పై షూటింగ్‌ జరుపుతున్నారు. త్వరలోనే పవర్‌ స్టార్‌ కూడా షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నారట.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 11:37 AM IST

Pawan Kalyan: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉన్నారు మేకర్స్‌. ఇలా అప్‌డేట్స్‌ ఇవ్వడం ద్వారా ఫ్యాన్స్‌లో జోష్‌ నింపడమే కాకుండా ఎప్పుడూ సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తున్నారు. నిజానికి ఇదో మాస్టర్‌ ప్లాన్‌. సినిమా గురించి ఎక్కువ కాలం అప్‌డేట్స్‌ ఇవ్వకుండా ఉంటే అంతా ఆ ప్రాజెక్ట్‌ను మర్చిపోతారు.

సినిమాపై రూమర్స్‌ కూడా వస్తాయి. ప్రొడక్షన్‌ సంగతి పక్కన పెట్టి రూమర్స్‌ను క్లియర్‌ చేయాల్సి వస్తుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్‌ లేకుండా సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందిస్తోంది డీవీవీ దానయ్య బ్యానర్‌. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకున్న ఓజీ సినిమా మూడో షెడ్యూల్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. కానీ పవన్‌ టాకీ పార్ట్‌ ఇంకా స్టార్ట్‌ కాలేదు. హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో పాటు కొందరు కీ యాక్టర్స్‌పై షూటింగ్‌ జరుపుతున్నారు. త్వరలోనే పవర్‌ స్టార్‌ కూడా షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా డీవీవీ బ్యానర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. పవన్‌ సెట్స్‌కు వచ్చిన తరువాత కొత్త అప్‌డేట్స్‌తో పాటు కొత్త ఫొటోలను కూడా రిలీజ్‌ చేస్తామంటున్నారు మేకర్స్‌.

సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌ తెగ వైరల్‌ అయ్యాయి. పంజా సినిమా తరువాత మరోసారి పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌ సినిమా మీద ఓ రేంజ్‌లో హోప్స్‌ పెట్టుకున్నారు. జెట్‌ స్పీడ్‌తో షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తున్న సుజీత్‌.. ఓజీ సినిమాతో పవన్‌ కళ్యాణ్‌కు ఎలాంటి హిట్‌ ఇస్తాడో చూడాలి.