ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు బాలు.. హీరోయిన్ కీర్తి రెడ్డి, ఈమె పాత్ర పేరు అను. ఈ స్టోరీలో పవన్ చెల్లెలు ప్రియా పాత్రలో వాసుకి నటించారు. ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలు ఎంత చక్కగా ఉన్నాయో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ కూడా అంతే వర్క్ అవుట్ అయ్యాయి. ఈ సినిమాకి రచన, దర్శకత్వం కరుణాకరన్ చేసారు. మనసును హత్తుకునే డైలాగ్స్, సరదా సంభాషణలు అందించారు రైటర్ చింతపల్లి రమణ. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్. సిరివెన్నెల, భువన చంద్ర సాహిత్యం అందించగా.. దేవా సంగీతం సమకూర్చారు.
ఈ చిత్రంలోని.. “ఈ మనసే సే సే”, “ఏమైందో ఏమో ఈ వేలా”, “ఎమి సోదరా”, “గగనానికి ఉదయమ్” పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రం 21 కేంద్రాలలో 100 రోజులకు పైగా ఆడింది. 2 సెంటర్లలో 200 రోజులకు పైగా నడిచింది. తొలిప్రేమ ఆరు నంది అవార్డులు అందుకుంది. ఉత్తమ సహాయ నటిగా వాసుకి, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఎ. కరుణాకరన్, దర్శకుడి ఉత్తమ మొదటి చిత్రంగా ఎ. కరుణాకరన్, ఉత్తమ ఆడియోగ్రాఫార్ గా మధు సూధన్, ఉత్తమ ఎడిటర్ గా మార్తాండ్ కే వెంకటేష్ లు నంది అవార్డు లు అందుకున్నారు.
ఈ మూవీ జాతీయ అవార్డు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (తెలుగు) విజేతగా నిలిచింది. అంతే కాదు 365 రోజులకు పైగా ఆడి వావ్ అనిపించింది. 30వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడింది. ఈ చిత్రం తరువాత తమిళంలోకి ఆనందమజై అనే పేరుతో డబ్ చేశారు. కన్నడలో ప్రీత్సు తప్పెనిల్లా, హిందీలో ముజే కుచ్ కెహనా హై గా రీమేక్ చేయబడింది. తొలిప్రేమ ఈ పాతికేళ్ళు కాదు ఇంకో పాతికేళ్ళు అయినా పవన్ ఫాన్స్ కి సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది.